చాలా మంది పడుకునే సమయంలో చెవిలో ఏదో దూరింది అని కేకలు పెడతారు, తీరా చూస్తే పురుగులు దోమలు లాంటివి వెళతాయి, ఈగలు పురుగులు లాంటివి వెళ్లడం చూసే ఉంటాం.. అందుకే పడుకునే సమయంలో కూడా చెవులకి ఏమైనా పెట్టుకోవాలి అని అంటుంటారు నిపుణులు.
కాని తాజగా ఓ మహిళ చెవిలో ప్రాణాలతో ఉన్న బొద్దింకను ఓ డాక్టర్ విజయవంతంగా తొలగించాడు. ఈ షాకింగ్ ఘటన చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావినెన్స్‌లో చోటుచేసుకుంది. వినడానికే ఆశ్చర్యపోయేలా ఉంది కాని ఇది నిజం, చెవిలో నొప్పి అని మహిళ ఆస్పత్రికి వచ్చింది, బయటకు ఏమీ కనిపించడం లేదు కాని ఆమె చెవిలో ఏముంది అని చూస్తే బొద్దింక ఉంది.
ఓటోస్కోప్‌తో డాక్టర్ ఆమె చెవిలో పరిశీలించగా…చెవి లోపలి భాగంలో ప్రాణాలతో ఉన్న బొద్దింకను చూసి షాక్‌కు గురైయ్యాడు. సర్జరీ చేయకుండా దానిని బయటకు తీశారు, అయితే దానిని గుర్తించకుండా అలా ఉంటే పెను ప్రమాదం జరిగేది అంటున్నారు వైద్యులు,, మహిళ నిద్రిస్తున్న సమయంలో బొద్దింక చెవిలోకి ప్రవేశించి ఉండొచ్చని భావిస్తున్నారు.