కాజల్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మంచు లక్ష్మీ – ఎందుకంటే

కాజల్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మంచు లక్ష్మీ - ఎందుకంటే

0
105

మంచు లక్ష్మికి టాలీవుడ్ లో అందరూ సన్నిహితులు అనే విషయం తెలిసందే, ఆమెకి ప్రతీ ఈవెంట్ కి ఫంక్షన్ కి అందరి నుంచి పిలుపు వస్తుంది, అందుకే లక్ష్మీ అంటే అందరికి ప్రత్యేక అభిమానం, ఇక ఆమె పలు పార్టీలకు కూడా అటెండ్ అవుతూ ఉంటారు.స్టార్ హీరోల వారసులతో పాటు యంగ్ హీరోయిన్లతో కూడా ఎప్పుడూ ఛిల్ అవుతూ ఉంటుంది మంచు లక్ష్మి.

రానా దగ్గుబాటి, తాప్సీ, రకుల్ ప్రీత్ సింగ్ ఆమెకి చాలా మంచి స్నేహితులు, ఇక తారక్ బన్నీ చరణ్ వీరు కూడా ఆమెకి చాలా క్లోజ్ ఫ్రెండ్స్… మంచు లక్ష్మి ఓ షో చేస్తుంది. రానా దగ్గుబాటి యూట్యూబ్ ఛానెల్ సౌత్ బే కోసం కమింగ్ బ్యాక్ టూ లైఫ్ విత్ మంచు లక్ష్మి అంటూ టాక్ షో మొదలు పెట్టింది.

ఇప్పుడు ఈ షో త్వరలోనే అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, జానీ డెప్, ఓప్రా విన్ ఫ్రే లాంటి ప్రముఖులు కూడా వస్తారని క్లారిటీ ఇచ్చింది మంచు లక్ష్మి. ఇక తాజాగా కాజల్ పెళ్లి గురించి మాట్లాడుతూ లాక్ డౌన్ లో పెళ్లి అయింది పార్టీలు ఇవ్వకుండా మిస్ అవ్వకు, పార్టీ ఇవ్వకుండా తప్పించుకోకు,పార్టీ విషయంలో ఛీప్గా మాత్రం బిహేవ్ చేయకు అంటూ సెటైర్ వేసింది.ఈ కరోనా పాండమిక్ తగ్గాక మనం పార్టీ చేసుకుందామని త్వరలోనే ఆమెతో షో చేస్తాను అని తెలిపింది ఆమె.