వింత సంఘ‌ట‌న ఆకాశంలో నుంచి మనుషులు పడ్డారు

వింత సంఘ‌ట‌న ఆకాశంలో నుంచి మనుషులు పడ్డారు

0
91

అస‌లు ఆకాశం నుంచి మ‌న‌షులు ప‌డ‌టం ఏమిటి అని అనుకుంటున్నారా , కొన్ని కొన్ని సంఘ‌ట‌న‌లు చాలా ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి, ఇది అలాంటిదే, సాహ‌స‌వీరులు చేసే ప‌నులు ఒక్కోసారి ఫెయిల్ అవుతూ ఉంటాయి, ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా ఒక్క‌సారి అదుపు త‌ప్పుతుంది.

అమెరికాలోని ఫ్లోరిడాలో. స్కై డైవింగ్ చేయడానికి ఆకాశంలోకి వెళ్లిన ఇద్దరు సాహసవీరులు పారాచూట్లు సరిగ్గా తెరుచుకోకపోవడంతో కింద పడిపోయారు. దీంతో అస‌లు వారికి ఏమైపోతుంది అని అంద‌రూ కంగారు ప‌డ్డారు , మొత్తానికి భారీగా గాలీ వీయ‌డంతో వారు పై నుంచి కింద ప‌డ్డారు.

దాదాపు వందల అడుగుల ఎత్తు నుంచి విమానం నుంచి ఇలా పారాచూట్ సాయంతో కింద‌కి దిగారు.. కాని అవి తెరుచుకోలేదు, దీంతో కింద ప‌డ్డారు అయితే అదృష్టం బాగుండి వారు చెట్ల‌పై ప‌డ్డారు, ఆ వేగానికి ఆ కొమ్మ‌లు కూడా విరిగాయి, దీనిని ఓ యువ‌తి వీడియో తీసి నెట్టింట్లో పెట్టింది, కాని వారికి కొన్ని గాయాలు అయ్యాయి, ప‌ది రోజులు రెస్ట్ అవ‌స‌రం అన్నారు డాక్ట‌ర్లు.