మాస్క్ వాడుతున్న ప్రతీ ఒక్కరు ఇది తెలుసుకోండి

మాస్క్ వాడుతున్న ప్రతీ ఒక్కరు ఇది తెలుసుకోండి

0
92

గతంలో పొల్యుషన్ గురించి ఇబ్బంది వస్తుంది అని కొందరు మాత్రమే మాస్క్ వాడేవారు, కాని ఇప్పుడు ప్రతీ ఒక్కరు మాస్క్ వాడుతున్నారు, దీంతో మాస్క్ ల వాడకం బాగా పెరిగింది, అయితే మాస్క్ ఇష్టం వచ్చినట్లు మాత్రం వాడకూడదు,
మార్కెట్ లో మాస్క్ లు చాలా రకాలు విక్రయిస్తున్నారు. కానీ అన్ని మాస్క్ లు సేఫ్ కావని అంటున్నారు నిపుణులు.

తుంపర్లు, ఇతర రూపాల్లో వైరస్ రాకుండా ఉండేందుకు ఫేస్ మాస్క్ లు ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. చేతులు శుభ్రం చేసుకుని మాస్క్ వేసుకోవాలి, జలుబు దగ్గు ఉంటే కచ్చితంగా ప్రతీ రెండు మూడు గంటలకు మాస్క్ మార్చుకోవాలి, పాలుకి వెళ్లినా ఆఫీసులకి వెళ్లినా మాస్క్ ఉండాలి.

ఇక మీ జేబులో ఓ కవర్ లో మరో మాస్క్ స్పేర్ లో ఉంచుకోండి, మూడు లేయర్లు ఉన్న మాస్క్ వాడితే మంచిది.
మాస్క్ లను ఉతికేందుకు వేడినీళ్లు ఉపయోగిస్తే బెటర్. సబ్బు, డిటర్జెంట్ సోప్ తో వాటిని ఉతకొచ్చు.కచ్చితంగా గుర్తు ఉంచుకోండి తడిసిన మాస్క్ లు అస్సలు ఉపయోగించవద్దు. మాస్క్ ధరించిన తర్వాత పదే పదే తాకొద్దు. మాస్క్ డస్ట్ బిన్ లోనే వేయాలి.