మీరు హైదరాబాద్ లో ఇళ్లు ఖాళీ చేస్తున్నారా మీకో గొప్ప ఆఫర్

మీరు హైదరాబాద్ లో ఇళ్లు ఖాళీ చేస్తున్నారా మీకో గొప్ప ఆఫర్

0
160
Charminar

ఇప్పుడు ఎక్కడ నగరాల్లో చూసినా అందరూ నగరాల్లో ఇళ్లు ఖాళీ చేసి గ్రామంలో సొంత ఇంటికి వెళ్లిపోతున్నారు, దీంతో భారీగా రెంట్ లు తగ్గుతున్నాయి, దీంతో చాలా మంది ఇప్పుడు ఇళ్లు ఖాళీ అని బోర్డులు పెడుతున్నారు, పది పోర్షన్లలో తప్పకుండా 5 ఖాళీ అయ్యాయి అని సర్వేలు చెబుతున్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో తమ ఉద్యోగులను పని చేసేందుకు అవకాశం ఇచ్చాయి కంపెనీలు.. దీంతో అందరూ గ్రామాలకు వెళ్లిపోతున్నారు, ఇక దాదాపు వచ్చే ఏడాది మార్చి వరకూ ఇలాగే ఉంటుంది, అయితే రెంట్ ఎందుకు కట్టడం అని గ్రామాలకు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.

కానీ కొందరు సిటీ ల్లో ఉన్న అద్దె ఇండ్లను ఖాళీ చేయాలా.. లేదంటే వాటికి అలాగే అద్దెలు చెల్లించాలా అన్న సందిగ్ధం లో ఉన్నారు, వీరు మాత్రం ఇంటి సామాన్లు స్టోర్ చేసేందుకు కొన్ని వసతులు చూస్తున్నారు.. ప్రత్యేకంగా ఇందుకోసమే కొన్ని సంస్థలు పుట్టుకొచ్చాయి. కరోనా వల్ల దెబ్బతిన్న వ్యాపారాలతో ఖాళీగా ఉన్న స్థలాల్లో తాత్కాలిక స్టోరేజ్ స్పేస్ లను ఏర్పాటు చేస్తున్నాయి, దీనికి తక్కువ రెంట్ వసూలు చేస్తున్నాయి.

ఉదాహరణకు 20 వేల హౌస్ రెంట్ ఉంటే కేవలం ఈ స్టోరేజ్ రూమ్ 4 వేలు 5 వేలకి వస్తోంది. ఫర్నిచర్ సహా అన్ని రకాల సామాన్ల ను భద్రపరిచేందుకు సదుపాయాలు కల్పిస్తున్నాయి పలు కంపెనీలు. స్టార్టప్ కంపెనీలు తమ కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే జిమ్స్, రెస్టారెంట్స్, ప్లే స్కూల్స్నే ఇలా అక సంస్థలు తాత్కాలికంగా సెల్ఫ్ స్టోరేజ్ సేవలను అందిస్తున్నాయి.