చాలా మంది బయటకు వెళ్లినా, ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, ఫోన్ తోనే సమయం గడిపేస్తున్నారు.. ఫోన్ లేకపోతే చాలా వరకూ ఏదో కోల్పోయిన బాధని ఫీల్ అవుతున్నారు, అయితే ఇది చాలా మందికి పెద్ద అడిక్ట్ అయిపోయింది.
దీని వల్ల అనేక ఇబ్బందులు ఉన్నాయి అంటున్నారు నిపుణులు, ఆరోగ్యపరంగా మీకు మొబైల్ ఫోన్ ఎక్కువవాడితే మెదడుకి ప్రమాదం, ఆ రేడియేషన్ ఎక్కువగా తగిలితే చాలా వరకూ మానసిక సమస్యలు వస్తాయి ..క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంది. తలనొప్పి, కంటి సమస్యలు ఇతర అనారోగ్యాలు తలెత్తే అవకాశం ఉంది.
1. క్రిములు ఎక్కువగా ఉంటాయి భోజనం చేసే సమయంలో సెల్ పక్కన ఉంచుకోకండి
2. నిద్రలేమి సమస్యలు వస్తాయి
3. కంటిపై ఎఫెక్ట్ చూపిస్తుంది
4. తలనొప్పికి ప్రధాన కారణం అవుతుంది
5. మెడ, వెన్నెముక సమస్యలు వస్తాయి
6. వేళ్లకు గాయాలు అవుతాయి సో ఎక్కువ మొబైల్ ఫోన్ వాడద్దు అంటున్నారు నిపుణులు.