మీ ఇంట్లో తాబేలు ప్రతిమలు బొమ్మలు ఉంటే ఇలా చేయండి ఎన్నో లాభాలు ?

మీ ఇంట్లో తాబేలు ప్రతిమలు బొమ్మలు ఉంటే ఇలా చేయండి ఎన్నో లాభాలు ?

0
145

కూర్మావతారం విష్ణు భగవానుని దశావతారాల్లో రెండోవది, ఆ స్వామిని నిత్యం కొలుస్తారు భక్తులు, అందుకే తాబేలు కనిపించగానే దానికి ఎలాంటి అపాయం తలపెట్టరు, అయితే వాటిని నీటిలో వదలాలి అని చెబుతున్నారు పండితులు, అంతేకాదు తాబేలుని బంధించకూడదు, అలాగే వాటికి అపాయం తలపెట్టకూడదు.

అయితే రెసిన్లు, మెటల్, గ్లాస్, స్ఫటికాలు, చెక్కలతో చేసిన తాబేలు బొమ్మల్ని షాపుల్లో అమ్ముతారు. వీటిని లక్ష్మీ కటాక్షం కోసం షాపుల్లో కూడా పెట్టుకుంటారు, వీటికి నిత్యం పూజ చేస్తారు, ముఖ్యంగా లోహాలలో చేసిన బొమ్మను ఇంట్లో లేదా ఆఫీసుల్లో వుంచితే.. శత్రువిజయం వుంటుంది. క్రిస్టల్లో చేసిన తాబేలు బొమ్మను నైరుతి లేదా వాయువ్యంలో వుంచటం మంచి ఫలితాలను ఇస్తుంది.

ఇక ఇంటిలో గాజుతో చేసిన తాబేలు బొమ్మని ఉంచి దానికి నిత్యం పూజ చేస్తే చాలా మంచిది, ఎలాంటి అశాంతి ఉండదు, మీరు అనుకోకుండా ఇంట్లోకి తాబేలు వస్తే కంగారు పడవద్దు.. మీకు ఏదైనా దోషాలు ఉంటే తొలగపోతాయి అంటున్నారు పండితులు.. బౌల్లో వుంచిన తాబేలు ప్రతిమని ఇంట్లో ఉత్తర దిశలో వుంచాలి. ఇది చాలా మంచిది..తాబేలు పాదాలు నీటిలో మునిగేలా ఈ బొమ్మను వుంచాలి. ఇలా చేస్తే ఆ ఇంట ప్రశాంతత కచ్చితంగా ఉంటుంది.