నెలకు సంపాదనేమో రూ.5 వేలు కానీ.. వాళ్లు కొన్నదేమో 700 ఎకరాలు. మార్కెట్ దీని విలువ రూ.200 కోట్లు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా.. సాధ్యమే.. ఎక్కడో తెలుసా ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో. కొన్న భూమికి డబ్బులు అక్కడి ప్రజలే చెల్లించారా.. ఇంకెవరైనా చెల్లించారా అన్న విషయం మాత్రం మమ్మల్ని అడగొద్దు. అది మీకే వదిలేస్తున్నాం.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపీక్. రాజధాని అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని వైకాపా ప్రభుత్వం వాదిస్తోంది. అటువంటిదేమీ లేదని తెదేపా నాయకులు కూడా వాదిస్తున్నారు. అమరావతి ప్రాంత ప్రజలకు నెలకు రూ.5 వేలు కానీ వాళ్లు కొన్నదేమో 700 ఎకరాలు ఇది నమ్మశక్యంగా ఉందా అని అధికార పార్టీ నాయకులు ఎదురు దాడికి దిగుతున్నారు.
ఇది ఇలా ఉంటే సుమారుగా 41 రోజుల నుంచి రాజధాని ప్రాంత ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. వీరి డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గి అమరావతి ఒక్క ప్రాంతానే రాజధానికిగా ప్రకటిస్తారో లేదో వేచి చూడాల్సిందే