మొత్తం పాములే ఈ ప్రాంతం గురించి వింటే ఒళ్లుగ‌గుర్పొడుస్తుంది

మొత్తం పాములే ఈ ప్రాంతం గురించి వింటే ఒళ్లుగ‌గుర్పొడుస్తుంది

0
107

మ‌న ప్ర‌పంచంలో అతి చ‌ల్ల‌ని ప్రాంతాల్లో పాముల సంఖ్య చాలా త‌క్కువ ఉంటుంది అనేది తెలిసిందే, మ‌రికొన్ని ప్రాంతాల్లో మ‌నుషుల‌ని మించేలా పాములు ఉంటాయి, అనేక స‌ర్ప‌జాతులు ఇంకా గుర్తించ‌నివి అమెజాన్ ప్రాంతాల్లో కొన్ని వంద‌లు ఉంటాయి అంటారు సైంటిస్టులు.

అయితే పాముని ఎవరు చూసినా వ‌ణుకు వ‌స్తుంది, అయితే ఒక‌ ప్రాంతంలో ల‌క్ష‌ల పాముల‌ని చూస్తే ఇక ప‌రుగు పెట్ట‌డ‌మే ఆల‌స్యం, మ‌రి మొత్తం పాములు ఉండే ప్రాంతం గురించి చెప్పుకుందాం.

బ్రెజిల్‌లోని సావ్‌పాలొ రాష్ట్రానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇల్హా డా క్విమాడా గ్రాండె అనే ద్వీపం. మొత్తం 110 ఎక‌రాలు ఉంటుంది, అట్లాంటిక్‌ మహాసముద్ర తీరానికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది, ఇక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఎవ‌రూ సాహ‌సించ‌రు.

క్విమాడా ద్వీపంలో 62 ఎకరాలు దట్టమైన అటవీ ప్రాంతం. మిగతాదంతా రాళ్లూ, రప్పలతో నిండిన భూమి. ఇక్క‌డ వ‌ర్షం ఎక్కువ అందుకే గ‌డ్డి కూడా బాగా మెలుస్తుంది. అందుకే ఇక్క‌డ పాములు తెగ వ‌చ్చేస్తున్నాయి, మనుషుల సంచారం కూడా లేకపోవడంతో పాములు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయాయి.

క‌ప్ప‌లు, ప‌క్షులు చిన్న చిన్న పురు‌గులు ఎక్కువ ఉంటాయి కాబ‌ట్టి పాముల‌కి ఎలాంటి ఇబ్బంది లేదు, దాదాపు ఇక్క‌డ నాలుగు ల‌క్ష‌ల పాములు ఉంటాయి అని అంటున్నారు.. పిట్‌ వైపర్‌ పాములు ఎక్కువ‌గా ఉంటాయి, ఇక్క‌డ‌కు వెళ్ల‌డానికి ఎవరికి అనుమ‌తి లేదు ప‌రిశోధ‌కులు ప‌ర్మిష‌న్ తీసుకుని వెళ్లాలి.