నోటిలో బతుకున్న చేపని పెట్టుకున్న జాలరి – చివరకు మింగేశాడు తర్వాత ఏమైందంటే

నోటిలో బతుకున్న చేపని పెట్టుకున్న జాలరి - చివరకు మింగేశాడు తర్వాత ఏమైందంటే

0
147

చాలా మంది చేపలు పట్టేవారు వాటిని పట్టిన తర్వాత వల నుంచి తీసి బుట్ట లేదా బాక్స్ లో వేస్తారు, కాని ఈ జాలరి వలలో పడిన ఓ చేపని తీసుకుని బాక్సులో వేయబోయాడు, ఇక మరో చేతిలో ఉన్న గాలంలో మరో చేప పడినట్లు తెలిసింది అది మిస్ అవుతుంది అని ముందు పట్టుకున్న చేపను నోటితో కరిచి పట్టుకుని రెండో చేపని తీసుకున్నాడు.

కాని ఈలోగా ఆ చేప అతని నోటిలోకి వెళ్లిపోయింది, దీంతో ఊపిరి ఆడని పరిస్ధితి, పక్కన జాలర్లకు ఏమైందో అర్ధం కాలేదు, వెంటనే అతను అపస్మారకస్దితిలోకి వెళ్లబోతున్నాడు, వెంటనే అతనిని పట్టుని ఆస్పత్రికి తీసుకువెళ్లారు, అయితే అదృష్టం ఏమిటి అంటే ఇలాంటివి జరిగితే ప్రాణాలు నిలవవు, ఎందుకు అంటే ఆ బతికి ఉన్న చేప నోటిలోకి వెళ్లి శ్వాసకోశాన్ని మూసేస్తుంది.

కాని అతనిక మొత్తం చేప మూయలేదు దీంతో కాస్త ఊపిరి ఆడింది… లేకపోతే అతని ప్రాణాలు అక్కడే పోయేవి అంటున్నారు వైద్యులు, వెంటనే అతనికి ట్యూబ్ ద్వారా ఆ చేపని గొంతు నుంచి తీశారు, వారం రోజులు గొంతు నొప్పి వచ్చింది, ద్రవపదార్ధాలు మాత్రమే తిన్నాడు వారం రోజుల వరకూ, ఈ ఘటన ఈజిప్టులోని స్నూర్కు చెందిన 40 ఏళ్ల జాలరికి జరిగింది, ఇక నైలు నది తీరంలో ఇలా జరిగింది.