ముఖేష్ అంబానీ సంపాదన ఈ ఏడాది కూడా భారీగా పెరిగింది… మొత్తానికి ఆయన సంపద విలువలో 17 బిలియన్ డాలర్లు రూ.1.20 లక్షల కోట్లు జోడించారు. దీంతో మొత్తం ఆయన ఆస్తి విలువ 6,100 కోట్ల డాలర్లకు రూ.4.27 లక్షల కోట్లకు పెరిగింది. ఆసియాలో అత్యంత సంపన్నుడైన ముకేశ్ ఈ ఏడాది కూడా ఆ ఘనతను తన పేరు సాధించారు.
ఇక ఆయన సంపద చూసి ఆయన వరుసకు కూడా భారత మిలియనీర్లు బిలియనీర్లు దాటలేకపోతున్నారు.. జియో కూడా ఆయన బిజినెస్ కు బాగా ప్లస్ అయింది. తాజాగా సంపన్నుల గురించి తెలిపే బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
ప్రస్తుత సంవత్సరం రిల్ షేర్లు భారీగా పుంజుకోవడం ముకేశ్ ఆస్తి వృద్ధికి కలిసి వచ్చింది అని రిపోర్ట్ చెబుతోంది.2019లో సంపద పెరుగుదల విషయంలో ప్రపంచ కుబేరులైన అమెజాన్ చీఫ్ జెఫ్ బేజోస్, అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా కూడా వెనకబడ్డారు ముకేష్ కు టెలికం ఇంధన రంగాల్లో పెట్టుబడులు అలాగే ధరలు పెరుగుదల బాగా కలిసివచ్చాయి.