నా ప్రియుడ్ని అన‌వ‌స‌రంగా ప‌రిచ‌యం చేశా -నా జీవితం ఇలా అయింది

నా ప్రియుడ్ని అన‌వ‌స‌రంగా ప‌రిచ‌యం చేశా -నా జీవితం ఇలా అయింది

0
114

దీప్తి రాయ్ కి బీబీఏ చ‌దివే స‌మ‌యంలో రాకేష్ అనే వ్య‌క్తితో ప‌రిచ‌యం ఏర్ప‌డింది.. ఇలా ప్రేమించుకున్న స‌మ‌యంలో ఆమె ఫ్రెండ్ సోనిని కూడా రాకేష్ కి ప‌రిచ‌యం చేసింది.. సోనీ ఇంజ‌నీరింగ్ చ‌దువుతోంది, అయితే దీప్తి పై రాకేష్ చూపించే ప్రేమ సోనికి న‌చ్చింది.. ఆ ప్రేమ మ‌రెవ‌రి ద‌గ్గ‌ర త‌ను పొంద‌లేదు అందుకే అన్నీ ఉన్న నాకు ఎందుకు రాకేష్ నా ప్రేమ‌లో ప‌డ‌డు అని భావించింది.

 

నెమ్మ‌దిగా అత‌నికి మంచి ఖ‌రీదైన ఫోన్లు బైక్ న‌గ‌దు ఇలా ఇచ్చి త‌న బుట్ట‌లో వేసుకుంది.. దీప్తిని నెమ్మ‌దిగా సైడ్ చేసి త‌న వైపు తిప్పుకుని త‌న‌ ప్రేమ‌లో ప‌డేలా చేసింది.. ఇప్పుడు దీప్తిని అత‌ను మర్చిపోయాడు,

ఇక సోనితో పెళ్లికి కూడా సిద్దం అయ్యాడు.

 

మొత్తానికి త‌న బాధ‌ని ఆమె త‌ల్లిదండ్రుల‌కి చెప్పింది అయితే ఇలాంటి వాడిని ప్రేమించి ద‌క్క‌లేదు అనే బాధప‌డ‌టం వేస్ట్ అని వ‌దిలేసింది.. ఇలాంటి వారు ఉంటారు అని తాజాగా ఓ మ్యాగ‌జైన్ కి త‌న బాధ చెప్పుకుంది, అత‌నిపై కేసు కూడా పెట్ట‌లేదు ఎందుకు అంటే అత‌ను ఇక నాకు అవ‌స‌రం లేదు అలాంటి వాడు నా మ‌న‌సులోనే కాదు ఆపేరు కూడా త‌ల‌చుకోను అని తెలిపింది దీప్తీ.