నాగబాబు రెమ్యునరేషన్ వింటే మతిపోతుంది

నాగబాబు రెమ్యునరేషన్ వింటే మతిపోతుంది

0
108

సినిమాలు ఎలా ఉన్నా నాగబాబుకి జబర్ధస్త్ మాత్రం ఫేమ్ డబ్బులు రెండూ ఇచ్చింది అనే చెప్పాలి.. నవ్వులనవాబు నాగబాబు అనే కీర్తి వచ్చింది..ఇక ఇటీవల జబర్ధస్త్ కు గుడ్ బై చెప్పారు.. ఈ సమయంలో నాగబాబుకు, జీ తెలుగు ఛానెల్ బ్రహ్మరథం పట్టింది. భారీగా నాగబాబుకి పారితోషికం ఇస్తోందట, కాస్ట్ లీ కారవాన్ కూడా ఆయనకు ఇచ్చారు అని తెలుస్తోంది.. జీ తెలుగులో కార్యక్రమాల కోసం నాగబాబుకు నెలకు 30 లక్షల రూపాయల వరకు ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.

అయితే ఆయనకు గతంలో జబర్ధస్త్ లో కేవలం 20 లక్షల రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ వచ్చేదట, స్టార్ట్ అయిన సమయం నుంచి ఇప్పటి వరకూ అదే రెమ్యునరేషన్ ఇచ్చారు .. కాని జీ లో మాత్రం నాగబాబుకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. అంతేకాదు బయట సినిమాలు చేసుకోవచ్చు కాని బుల్లి తెర షోలు కుదరదు అనే ఒప్పదం రాయించుకున్నారు అని వార్తలు వస్తున్నాయి, ఆయనకు వీలైనప్పుడు షూట్ పెట్టుకుంటున్నారట..

కొన్ని కార్యక్రమాలకి ఆయనని ప్రత్యేక అతిథిగా రావాలి అని కూడా కోరారట.. దానికి కూడా రెమ్యునరేషన్ ఇస్తారట.. ఇక పాత సంస్ధలా కాకుండా రెండేళ్లకు ఒకసారి పేమెంట్ ను సవరించేలా అగ్రిమెంట్ రాసుకున్నారట.కార్పొరేట్ ఛానెల్ కాబట్టి పేమెంట్ తో పాటు కండిషన్స్ కూడా పక్కాగానే ఉంటాయి. వందల కోట్ల రూపాయల టర్నోవర్ కాబట్టి ఎంటర్ టైన్మెంట్ కంటెంట్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది..