నాగబంధం అంటే ఏమిటి ఎలా వేస్తారు? దాని చరిత్ర ఇదే

నాగబంధం అంటే ఏమిటి ఎలా వేస్తారు? దాని చరిత్ర ఇదే

0
951
Naga Bandham

కేరళలోని అనంత పధ్మనాభస్వామి ఆలయంలో నేలమాళిగల్లో ఉన్న సంపద గురించి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి, ఐదు తలుపులు తెరిచారు కాని ఆరోతలుపు తీయాలి అంటే అందరూ భయపడుతున్నారు, ఇక దీనికి కారణం ఆ తలుపుకి కట్టుదిట్టమైన శక్తివంతమైన నాగబంధం ఉండటమే.

సుప్రీంకోర్టు ఆలయ నిర్వహణ బాధ్యతలు ట్రావెన్ కోర్ రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది. అందువల్ల ఆరోగది తెరవాలా వద్దా అనేది ఇప్పుడు ట్రావెన్కోర్ ఫ్యామిలీ నిర్ణయం తీసుకోనుంది. ఈ నాగబంధం ఉన్న గది ఎలాబడితే అలా తెరిస్తే… ప్రళయం తప్పదని కొందరు అంటున్నారు సిద్దులు సాధువులు ఆ గది తెరవద్దు అని అంటున్నారు.

అయితే ఆరో గదిలో లెక్కలేనంత నిధి నిక్షేపాలు ఉన్నాయనీ… వాటిని కాపాడేందుకే… ఆ గదికి నాగ బంధం వేశారనీ ఇప్పుడు తీసి ఆ ప్రళయం తెచ్చుకోవద్దు అంటున్నారు, అయితే ఇలా నాగబంధం ఎందుకు వేస్తారు, అంటే గతంలో రాజులు ఏదైనా బంగారం వజ్రాలు విలువైన సంపద ఇస్తే వాటిని నేలమాలిగళ్లో పెట్టి ఆ గదికి నాగబంధం వేసేవారు.

అక్కడ పాములు కూడా ఉంటాయి, దీంతో అది శక్తివంతంగా ఉంటుంది, ఎవరైనా ముట్టుకున్నా నాగబంధ ప్రభావంతో మరణిస్తారు, అలాగే విషసర్పాలు అందులో ఉంటాయి అని గతంలో దొంగలు కూడా నాగబంధం ఉంటే దాని జోలికి వెళ్లేవారు కాదట.

మరి ఆ గదిని తెరవాలంటే ఉన్న ఏకైక మార్గం ఒకటే … అది గరుడ మంత్రంతోనే సాధ్యమని అంటున్నారు. ఐతే… ఇప్పుడు దేశంలో ఆ గరుడ మంత్రం వేసి… నాగ బంధాన్ని తెరిచేవాళ్లు లేరని తెలుస్తోంది. అలాంటి సిద్దులు చాలా మంది మరణించారు, అందుకే ఆ గదిని అలా స్వామికి వదిలెయ్యాలి అని అంటున్నారు.