నెమలి అంటే అందరికి ఇష్టం ఉంటుంది.. దాని నాట్యం అంటే కూడా ఎంతో మంది ఇష్టపడతారు…మన పోలికలు కూడా చాలా వరకూ మయూరీతొ పోలుస్తూ ఉంటాము, అయితే చాలా మంది ఇంటిలో నెమలి పించాలను పెట్టుకుంటారు.. దీని వల్ల సిరి సంపదలు వస్తాయి అని నమ్ముతారు, ఇలాంటివి ఇంటిలో పెట్టుకుంటే సిరికి లోటు ఉండదు అని వాస్తుకి మంచిది అని నమ్మేవారు ఉంటారు ..అసలు నిజంగా నెమలి పించం వల్ల ఎలాంటి ప్రయోజనం అనేది తెలుసుకుందాం.
నెమలి ఫించంతో వాస్తు దోషాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. నెమలి కుమార స్వామి వాహనం. నెమలిని జాతీయ పక్షి…ఆ నెమలి ఫింఛం శ్రీకృష్ణుని కిరీటంపై నిత్యం నివసిస్తూ వుంటుంది అనేది తెలిసిందే, ఈ పించం చిన్నది అయినా సరే దేవుడి గదిలో ఉంచి పూజిస్తే వారికి దోషాలు తొలగిపోతాయి. కుటుంబంలో శాంతి ఉంటుంది.
పూజగదిలో వుంచినట్లైతే వాస్తుదోషాలు తొలగిపోతాయి. నృత్యం చేసిన సమయంలో కింద పడిన నెమలి పించాలు తెచ్చుకుంటేనే ఈ ఫలితం ఉంటుంది, వాటికి హని చేసి తెచ్చుకుంటే మాత్రం మంచి జరుగదు, బీరువాలో నెమలి పించం సింహసనం దగ్గర పెట్టుకోవాలి ఇది ఆరోగ్యం శాంతి ధనం కలిగిస్తుంది.