నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటున్నారా ఇది తెలుసుకోండి

నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటున్నారా ఇది తెలుసుకోండి

0
178

ఈ తరం పిల్లలు చాలా మంది పుస్తకాల్లో నెమలి ఈకలు పెట్టుకోవడం లేదు కాని, 1970 నుంచి 2010 వరకూ చూస్తే చాలా మంది పిల్లలు నెమలి ఈకలు పుస్తకాల్లో పెట్టుకునేవారు ..మంచి చదువు వస్తుంది అని, అలాగే అది పిల్లలు పెడుతుంది అని నమ్మేవారు.

అయితే ఈ నెమలి ఈకల గురించి జ్యోతిషశాస్త్రం లో కూడా చెబుతారు.. ఇంట్లో నెమలి పించం ఈకలు ఉంచడం చాలా పవిత్రమైనదని అంటారు. దీనితో, ఇంట్లో నెమలి ఈక ఉంటే ధనానిని ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెబుతారు.

అయితే నేరుగా ఆ పించాలు నెమలి నుంచి రాలిపడాలి …వాటిని హింసించి తెచ్చిన వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు రావు, ఇక ఇంటి ముందు నెమలి పించం మనకు తగలకుండా ఉంచాలి ఇది వాస్తుకి మంచిది.

ఏదైనా ఆర్దికపరమైన పనికి వెళితే కచ్చితంగా నెమలి ఈకలను పట్టుకుని నమస్కరించి వెళ్లండి, దేవుని గూటిలో బీరువాలోని సింహాసనంలో ఇవి ఉంచితే చాలా మంచిది, ఇక ఇంటికి బిడ్డలకు దిష్టి వచ్చింది అని భావిస్తే ఆ నెమలి పించం హనుమాన్ దగ్గర ఉంచి సిందూరం రాసి దానిని తలపై రాస్తే బిడ్డలపై ఉన్న చెడు అంతా పోతుంది.