ఒక్కోసారి అదృష్టం మన తలుపుతడితే ఎవరు ఆపినా మనం డోర్ తెరుస్తాం, ఇలాంటి ఫేట్ ఉంటే ఎవరూ మార్చలేరు, చాలా మంది లాటరీల్లో నగలు వజ్రాలు దొరికిన వాళ్లు ఇలా అపరకుబేరులు అవ్వడం చూసే ఉంటాం. తాజాగా ఇలాంటిదే జరిగింది.
టాంజానియాకి చెందిన ఒక వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడైపోయాడు. , రెండు పెద్ద రత్నాలను విక్రయించి ధనవంతుయ్యాడు. గనులు తవ్వే పని చేసుకుంటూ బతికే లైజర్ అనే వ్యక్తికి ముంజేయి పరిమాణంలో ఉండే రెండు రత్నాల రాళ్లు దొరికాయి, వీటిని చూస్తే మొదటిది బరువు 9.27 కిలోలు రెండవ బరువు 5.103 కిలోలు.
ఈ రత్నాలను అతని దగ్గర నుంచి ఆ దేశ ప్రభుత్వం దాదాపు 7.74 బిలియన్ టాంజానియన్ షిల్లింగ్స్కు కొనుగోలు చేసింది. అంటే వీటి ధర భారతదేశ కరెన్సీలో 25 కోట్ల వరకు ఉంటుంది. దీంతో ఆకుటుంబం చాలా ఆనందంలో ఉంది.