వాచ్ ల యందు ఖరీదైన వాచ్ లు వేరయా అని మనం వింటూ ఉంటాం, అన్నీ వాచీలు టైం చెబుతాయి, కాని కొన్ని వాచెస్ టైమ్ తో పాటు వారిక్లాస్ ని లుక్ ని మార్చేస్తాయి, ఇక సినిమా సెలబ్రెటీలు పొలిటిషియన్స్ , బిజినెస్ టైకూన్స్ మినిమం లక్షల్లో ఉండే వాచెస్ ధరిస్తారు, వారు ధరించే బట్టలు షూ చెప్పులు కార్లు లగ్జరీ గూడ్స్ గాగుల్స్ ఇలా ఏది చెప్పుకున్నా అన్నీ లక్షలు కోట్లలో ఉంటాయి.
అయితే తాజాగా రామ్ చరణ్ ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి, నిహారిక ఎంగేజ్ మెంట్ లో రామ్ చరణ్ తన చేతికి ధరించిన వాచ్ గురించి మాట్లాడుకుంటున్నారు , ఇప్పుడు అభిమానులు కూడా మీరు చరణ్ వాచ్ చూశారా అని అంటున్నారు, ఎందుకు అంటే అది చాలా ఖరీదైన వాచ్ అని అంటున్నారు.
చరణ్ ధరించిన వాచ్ జీశాప్ కాసియో అనే బ్రాండ్. ఇది యూత్ఫుల్ మోడల్.. ధీని ధర లక్షల్లో ఉంటుంది ఈ వాచ్ అంటున్నారు స్టైలిష్టులు.. మరి మెగాస్టార్ తనయుడు, అలాగే బిజినెస్ మ్యాన్. ప్రముఖ హీరో, సింపుల్ గా ఉండే చరణ్ ఏది ధరించినా లుక్ అదిరిపోతుంది అంటున్నారు అభిమానులు.