బ్రేకింగ్ – ఉదయ్ విలాస్ లో నిహారిక చైత‌న్య వివాహం – అది ఎక్క‌డంటే

బ్రేకింగ్ - ఉదయ్ విలాస్ లో నిహారిక చైత‌న్య వివాహం - అది ఎక్క‌డంటే

0
149

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక వివాహ సంద‌డి మొద‌లైంది…నిహారిక వివాహానికి ముహూర్తం నిశ్చయమైంది. ఇటీవ‌ల ఎంగేజ్ మెంట్ పూర్తి చేసుకుంది ఈ జంట‌, తాజాగా వారి వివాహానికి సంబంధించి డేట్ అలాగే వేదిక ఫిక్స్ అయింది.

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు తనయుడు చైతన్య జొన్నలగడ్డతో నిహారిక వివాహం జ‌రుగ‌నుంది.ఆగష్టు నెలలో హైదరాబాదులో నిశ్చితార్దం జ‌రిగింది, ఇక వివాహం విష‌యానికి వ‌స్తే డిసెంబర్ 9న జరగనుంది. ఈ విషయాన్ని వరుడి తండ్రి ప్రభాకరరావు మీడియాకు తెలిపారు.

ప్రభాకరరావు కుటుంబం తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు, స్వామి ద‌గ్గ‌ర వివాహ శుభ‌లేక ఉంచి ఆశీస్సులు పొందారు, ఆ త‌ర్వాత మీడియాకు తెలిపారు..డిసెంబర్ 9న రాత్రి 7.15 నిమిషాలకు వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు. అలాగే వివాహాన్ని రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ నగరంలోని ఒబెరాయ్ ఉదయ్ విలాస్ హోటల్ లో చేయ‌నున్నారు. దీంతో మెగా అభిమానులు ఆ జంట‌కి బెస్ట్ విషెస్ అంద‌చేస్తున్నారు.