తారక్ వచ్చే సినిమా ఆ దర్శకుడితోనేనా ? టాలీవుడ్ టాక్

Ntr next film is with that director

0
168

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ కంప్లీట్ చేశారు.ఈ మూవీలో కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ ఎవరితో సినిమా చేయబోతున్నాడన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆయన అభిమానులతో పాటు ఇటు టాలీవుడ్ సినిమా ప్రముఖులు అందరూ కూడా దీని గురించి చూస్తున్నారు. తార‌క్ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయాలని చూశారు.

సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేశారు. అయినను పోయి రావలె హస్తినకు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ కూడా చూస్తున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో సినిమా చేయనున్నారు. సర్కారు వారిపాట తర్వాత ఆ సినిమా పట్టాలెక్కనుంది.

ఇక తాజాగా కొరటాల శివతో సినిమా ఉండవచ్చు అని టాక్ నడుస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్ లో జనతాగ్యారేజ్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా చేయనున్నారట. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ ను ఎంపిక చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇక తర్వాత కేజీఎఫ్ దర్శకుడితో సినిమా చేయనున్నారట తారక్ .