NTV ఫౌండర్ తుమ్మల నరేంద్ర చౌదరి కి ఆ స్కాం కి ఎలాంటి సంబంధం లేదా.. కావాలనే ఇరికించారా..!!

-

ఒక వ్యక్తి ఎదుగుతుంటే తొక్కేయడం మన బడా బాబులకు అలవాటే.. ఒకడు మంచి పని చేసినా , ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటున్నా ఎందుకో ఎక్కడలేని అసూయా, ఈర్ష్య ద్వేషాలు వస్తాయి.. అలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. NTV ఫౌండర్ తుమ్మల నరేంద్ర చౌదరి మీడియా రంగంలో ఎనలేని సేవలందించిన విషయం మనకు తెలిసిందే. జర్నలిజానికి నిలువెత్తు రూపంగా ఆయనని అభివర్ణిస్తారు పాత్రికేయులు.. అలాంటి అయన పై బురదచల్లే ప్రయత్న చేస్తున్నారు కొందరు మీడియా ప్రతినిథులు.. అయన ఎదుగుదలను ఓర్వలేక అక్రమ కేసులు దౌర్జన్యంగా బనాయించి అయన ఇమేజ్ ని తగ్గించే ప్రయత్న చేస్తున్నారు..

- Advertisement -

ప్రధానంగా ఓ స్కాం లో అయన పేరు ఎక్కువగా వినపడుతుంది.. ఓ ల్యాండ్ స్కాం లో అయన పేరు ను కావాలని ఇరికించే ప్రయత్నం చేశారు కొందరు.. ఇప్పటివరకు క్లీన్ హిస్టరీ ఉన్న చౌదరి గారి పేరు తెర మీదకు హఠాత్తుగా రావడానికి అనేక కారణాలున్నాయి. మొన్నమొన్నటి వరకు తుమ్మల నరేంద్ర చౌదరి అధ్యక్షతన ఉంది ఓ కో ఆపరేటివ్ సొసైటీ ప్యానెల్.. కానీ ఇటీవలే జరిగిన ఎన్నికల్లో మరొక మీడియా సంస్థ ప్యానెల్ గెలుపొందింది.. కాగా ఈ పోటీలో తుమ్మల నరేంద్ర చౌదరి ఈ పోటీ లో పాల్గొనలేదు.. అయన బలపరిచిన ప్యానెల్ ఓడిపోయింది. అయితే అసలు సంగతి ఇక్కడే మొదలైంది.. గత నెల చివరి వరకు ఈ స్కాం కు సంభందించి ఎటువంటి మూలాలు లేవు కానీ హఠాత్తుగా తెర మీదకు రావడం వెనుక నరేంద్ర చౌదరి మీద సదరు గెలిచిన ప్యానెల్ యొక్క హస్తం ఉందని, వారే కాకుండా కొంత మంది పని గట్టుకుని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది.

కో ఆపరేటివ్ సొసైటీ ప్యానెల్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబడిన ప్రముఖ మీడియా సంస్థ డైరెక్టర్ నరేంద్ర చౌదరి పైన గత ప్యానెల్ సెక్రెటరీ పైన భూ కబ్జా కింద కేసు పెట్టడం జరిగింది. అది కూడా ఎన్నికలలో తమ ప్యానెల్ గెలిచిన తరువాత వీరిపై భూ కబ్జా కింద కేసు పెట్టడం జరిగింది .. అంతకుముందు ఈ కేసు ఎక్కడికిపోయింది అని ప్రశ్నిస్తున్నారు నరేంద్ర చౌదరి ని అభిమానించే పాత్రికేయ మిత్రులు.. గతంలో ఇద్దరి వ్యక్తుల మధ్య జరిగిన ఈ లావాదేవీని ఇప్పుడు స్కాం పేరుతో బయటకు తీసుకురావడం వెనుక అసలు కోణం ఆయనపై బురద చల్లడమే అని క్లియర్ గా తెలుస్తుంది.

సదరు కో ఆపరేటివ్ సొసైటీ ప్యానెల్ గత అధ్యక్షుడయిన నరేంద్ర చౌదరి వ్యక్తిగా , సామాజిక సంస్కర్త గా తన వ్యాపార దక్షతకు సమాజ సేవ దృక్పధం జోడించి అనేకానేక వ్యక్తి వికాస మరియు సమాజ వికాస కార్యక్రమాల్లో తన వంతు అద్వితీయమైన కృషిని కొనసాగించారని ప్యానెల్ లోని సభ్యులు కొనియాడారు.. ఆఖరికి NTV సంబంధిత ఛానళ్ల విషయంలోనూ ఆయనను కృంగదీసే ప్రయత్న చేస్తున్నారు.. ఎంతో ఆధ్యాతికతను ప్రేక్షకులను పంచుతున్న భక్తి ఛానల్ ను రానివ్వకుండా, పాపులర్ కానివ్వకుండా కొంతమంది మీడియా బడా బాబు లు చూస్తున్నారు.. ఆ ఛానల్ గురించి బ్యాడ్ గా కొన్ని వెబ్ సైట్ లు, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా ప్రచురింపచేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి.

కోటిదీపోత్సవం వంటి ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలకు పునాది వేసిన ఓ సంఘసంస్కర్త ని పై ఎంతమంది ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలనీ చూసినా దాన్ని ఎదుర్కొని నిలబడతారు తప్పా కృంగిపోరు అని ఆయన్ని అభిమానించే వారు అంటున్నారు.. .. ఆయనను దిగజార్చడానికి ప్రముఖ మీడియా సంస్థలు శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నాయని ఇప్పటికే తెలుస్తుంది. వీటన్నిటికీ Tummala Narendra Chowdary గారు సమాధాన ఇచ్చే రోజు దగ్గరలోనే ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...