ఓ ప్రేమికుడి ఆవేదన – ఇలాంటి అమ్మాయిలు ఉంటారు బ్రదర్

ఓ ప్రేమికుడి ఆవేదన - ఇలాంటి అమ్మాయిలు ఉంటారు బ్రదర్

0
162

నిజమే అందరూ ఒకేలా ఉండరు, ఇక్కడ సంహిత అనే అమ్మాయిని ఉత్తేజ్ అనే అబ్బాయి ప్రేమించాడు, ఇద్దరూ కలిసి మూడు సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు, మొత్తానికి ఈకరోనా సమయంలో ఏడు నెలలు దూరంగా ఉన్నారు, అయితే చదువు అవ్వడంతో వచ్చే ఏడాది జాబ్ ట్రయల్స్ చేసి జాబ్ వచ్చాక ఆమె ఇంట్లో మాట్లాడాలి అని భావించాడు.

ఆమె కూడా ఒకే అంది, కేవలం చాటింగ్ ఫోన్ తో ఈ ఏడు నెలలు ఉన్నారు, కాని హఠాత్తుగా ఆమె పది రోజులు ఫోన్ లేదు మెసేజ్ లేదు, చివరకు ఆమె ఫ్రెండ్ ద్వారా అతను ఓ విషయం తెలుసుకున్నాడు, ఆమె ఓ ఎన్నారై సంబంధం రావడంతో ఒకే చెప్పింది …చివరకు ఆమెకి అతనికి ఎంగేజ్ మెంట్ కూడా అయింది అని తెలిసింది.

అయితే నేను చాలా లగ్జరీగా పెరిగాను, మానాన్న నన్ను ఎంతో బాగా పెంచారు, వాడు ప్రేమ అని తిరిగాడు కాదు అని అనను, కాని నన్ను పెళ్లి తర్వాత ఎలా పోషిస్తాడు, జాబ్ లేదు, పైగా మా పేరెంట్స్ ఒప్పుకోరు, వాళ్ల మాట నేను కాదు అనలేను, ఇక నా దూరపు బంధువుల అబ్బాయి ఈ ఎన్నారై సంబంధం తెచ్చారు,
నేను వాళ్లకి నచ్చాను, పైగా నాకు ఐఫోన్ ఇచ్చాడు , ఎంగేజ్ మెంట్ కి డైమెండ్ రింగ్ ఇచ్చాడు, నా పేరు మీద ఓ విల్లా రాస్తున్నారు, ఇంతకన్నా నాకు ఏం కావాలి, అందుకే వాడిని లైట్ తీసుకున్నాను అని ఫ్రెండ్ కి చెప్పింది, అయితే తన కుటుంబం కోసం ఆమెని మర్చిపోయి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు ఉత్తేజ్..

ఓ మ్యాగజైన్ స్టోరీ వారి అసలు పేర్లు ఇవి కాదు పేర్లు మార్చి ఇవ్వడం జరిగింది.