ఒక వ్యక్తి ఇంటి గుమ్మానికి 10.5 అడుగుల పాము వేలాడుతూ కనిపించింది

ఒక వ్యక్తి ఇంటి గుమ్మానికి 10.5 అడుగుల పాము వేలాడుతూ కనిపించింది

0
113

వేసవి కాలంలో ఎండ తీవ్రతను తట్టుకోలేక పాములు ఇళ్లల్లోకి చేరుకుంటున్నాయి.. అలా తాజాగా ఒక వ్యక్తి ఇంట్లోకి సుమారు 10.5 అడుగుల పాము వెళ్లింది.. ఇంట్లో రాకాసి బల్లితో పోరాడుతుంది… ఆసమయంలో ఏవో వింత శబ్దం రావడంతో లైట్ వేసి చూస్తే గుమ్మారికి పాము వేలాడుతుంది…

సడన్ గా పాము చూసే సరికి అతడి గుండే జారినంత పని అయింది… ఈ సంఘటన ఒడిశాలోని నయాగడ్ జిల్లాలోని రమేష్ ప్రధాన్ అనే వ్యక్తి ఇంట్లో జరిగింది… ఇంట్లో పాము చూడగానే అతడు వెంటనే స్నేక్ హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి సమచారం అందించాడు…

వాలెంటీర్ వచ్చే లోపు బల్లి మృతి చెందింది… ఆతర్వాత పాము ఇంటి కప్పులోకి వెళ్లిపోయింది.. దాన్ని పట్టుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పట్టింది… ఎట్టకేలకు ఆ పామును పట్టుకున్న వాలెంటీర్ దాన్ని అడవిలో వదిలేశాడు… దీంతో రమేష్ ప్రధాన్ కుటుంబం ఊపిరి పీల్చుకుంది…