ఒక్క రోజులో ఆ ఇంటిలో జీవితం త‌ల‌కిందులు అయింది

ఒక్క రోజులో ఆ ఇంటిలో జీవితం త‌ల‌కిందులు అయింది

0
168

నేహ అర్జున్ దిల్లీలో కూలీప‌ని చేసుకునే వారు అక్క‌డ నుంచి త‌మ సొంత గ్రామం యూపీలోని ఓ ప్రాంతానికి వ‌చ్చేశారు, వ‌చ్చిన త‌ర్వాత ఉన్నాదానిలో బ‌తుకుతున్నారు… ఎవ‌రైనా సాయం చేస్తే, రేష‌న్ స‌రుకులు తెచ్చుకుని తింటున్నారు, కాని తాజాగా అక్క‌డ మద్యం షాపులు తెరు‌చుకోవ‌డంతో…

అర్జున్ మ‌ద్యం తాగుతాను అన్నాడు , భార్య వ‌ద్ద‌ని వారించింది… కాని ఆమెని భ‌ర్త‌ కొట్టాడు, ఆమెపై దాడి చేసి సొమ్ము 500 తీసుకుని మద్యం తెచ్చుకున్నాడు. మ‌ర‌లా మ‌ద్యం కోసం డ‌బ్బు కోసం చూశాడు …దొర‌క‌లేదు మ‌ద్యం వ‌ద్ద‌ని భార్య వారించినా ఆమె మాట విన‌లేదు.

చివ‌ర‌కు ఆమె విసుగుతెప్పిస్తోంది అని నాటు తుపాకితో ఆమెని కాల్చి చంపేశాడు, అయితే ఆ కుటుంబం విషాదంలో ఉంది, తండ్రి చేసిన ప‌నికి నాలుగేళ్ల కొడుకు ఇంట్లో నుంచి బ‌య‌ట‌కు పారిపోయాడు, అత‌ను పోలీసుల‌కు చిక్కాడు, అయితే భార్య ప్ర‌శ్నించ‌డంతో ఈ ప‌ని చేశాను అని భ‌ర్త అన్నాడు, అక్క‌డ మ‌ద్యం షాపులు తీయ‌డంతో ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌ని మ‌ద్యం షాపులు మూయాల‌ని అక్క‌డ అంద‌రూ ధ‌ర్నాకు దిగారు.