ఒక్క న్యూస్ పేపర్ తో 25 కోట్లు సంపాదించాడు లక్కీ బాయ్

ఒక్క న్యూస్ పేపర్ తో 25 కోట్లు సంపాదించాడు లక్కీ బాయ్

0
127

వెన్సెంట్ అనే వ్యక్తి కి చిన్న తనంలో తండ్రి చనిపోయాడు, తల్లి అతనిని పెంచింది, అయితే అనూహ్యంగా అతను కాలేజీ చదువుతున్న సమయంలో ఆమె చనిపోయింది, ఈ సమయంలో అతను తన ఇంటిలో ఉన్న పాత సామాన్లు అన్నీ తీశాడు.

ఈ సమయంలో అతనికి ఓ పేపర్ల కట్ట కనిపించింది. దాదాపు అది 20 ఏళ్ల క్రితంది.. అందులో ఏమి ఉన్నాయో బహుశా తన తల్లిదండ్రులకి కూడా తెలియదు, అవన్నీ తీస్తున్న సమయంలో అందులో తన తండ్రి తండ్రి, అంటే వెన్సెంట్ తాత ఓ రెండు ఎకరాల భూమిని తన కుమారుడికి రాశాడు.

అది వెన్సంట్ తండ్రి కూడా చూసుకోలేదు ఆ వీలునామా పత్రం చూసి తన స్నేహితుడి తండ్రి లాయర్ కావడంతో ఆయన దగ్గరకు వెళ్లాడు, అయితే ఇది మీ తండ్రికి ఇచ్చిన ఆస్తి దీనిపై నీకు హక్కులు ఉన్నాయి అని కేసు వేశారు, అయితే ఆ పొలం పండిస్తున్న ఓ ఎస్టేట్ ఓనర్ కు కోర్టు నోటిస్ ఇచ్చింది. దీంతో అతను ఖాళీ చేసి వెన్సెంట్ కు ఇచ్చేశాడు, ఆ పాతపేపర్లో ఆ డాక్యుమెంట్ తన జీవితం మార్చింది అని తాజాగా ఓ జర్నల్ లో ఈ విషయం చెప్పాడు, వాటిని అమ్మేసి సొంత వ్యాపారం పెట్టాడు వెన్సెంట్.