ఉల్లిపాయలతో కోటీశ్వరుడు అయిన రైతు దేశమే షాక్

ఉల్లిపాయలతో కోటీశ్వరుడు అయిన రైతు దేశమే షాక్

0
109

ఉల్లి కొంటే కూడా కళ్ల మంట తెప్పిస్తోంది.. కాని వీటిని అమ్మే రైతులని మాత్రం కోటీశ్వరులని చేస్తోంది. దేశంలో ఉల్లిధరలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే.. కిలో 200 నుంచి 120 వరకూ మార్కెట్లో ఉల్లి అమ్ముతున్నారు… సామాన్యుడి ఉల్లి కష్టాలు అలా ఉంటే.. రైతులకు మాత్రం భారీ లాభాలు తెచ్చిపెడుతున్నాయి. పెరిగిన ఉల్లి ధరలతో కర్ణాటకలో ఓ రైతు నెలలోనే కోటీశ్వరుడు అయ్యాడు.

కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా దొడ్డసిద్దవ్వనహళ్లికి చెందిన మల్లికార్జున ఉల్లి సాగు చేసి భారీగా లాభాలు అర్జించాడు.. ఇప్పుడు మల్లిఖార్జున్ ఓ సెలబ్రిటీ అయ్యాడు. అందరూ ఆయన సక్సెస్ స్టోరీ గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు. దాదాపు 240 టన్నులు ఉల్లి పంట అతనికి వచ్చింది. మొత్తం 20 ఎకరాల పంట వేశాడు. సుమారుగా ఖర్చులు పోను అతనికి 1.68 కోట్లు వచ్చాయి, కేవలం పెట్టుబడికి 15 లక్షల రూపాయలు అయింది అని చెప్పాడు.

2004 నుంచి ప్రతి ఏటా ఉల్లి పంటను సాగు చేస్తున్న రైతు మల్లిఖార్జున.. కరువుతో చాలామంది ఉల్లిసాగును వదిలేసినా.. ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు..7 వేల నుంచి 12 వేలకు క్వింటాల్ అమ్మాము అని నా జీవితంలో ఇంత రేటు రాదు అనుకున్నా కాని భారీగా ధర వచ్చింది అంటున్నాడు, తనకు ఉన్న అప్పులు తీర్చేసి మరో 10 ఎకరాలు పంట కొనుక్కొని ఉల్లి సాగు చేస్తా అంటున్నాడు .తమ పిల్లల కోసం ఇళ్లు నిర్మిస్తా అంటున్నాడు ఈ రైతు.