ఓ చిన్న వీడియో టిక్ టాక్ లో ఆ తండ్రి కొడుకులకి లైఫ్ ఇచ్చింది

ఓ చిన్న వీడియో టిక్ టాక్ లో ఆ తండ్రి కొడుకులకి లైఫ్ ఇచ్చింది

0
107

టిక్ టాక్ వల్ల చాలా మంది ఫేమస్ సెలబ్రెటీలు అవుతున్నారు , కోట్లాది మంది వీక్షణ చేస్తున్నారు.. లక్షలాది మంది లైక్ కొడుతున్నారు …ఇలా నిత్యం కొన్ని లక్షల వీడియోలు ఇందులో షేర్ అవుతున్నాయి, అయితే టిక్ టాక్ మార్కెట్ పెరగడంతో ఫేస్ బుక్ వాట్సాప్ ని మించి ఇందులో ఫాలో వర్స్ ఉంటున్నారు..

అయితే టిక్ టాక్ ఓ కుటుంబాన్ని కలిపింది, తన తండ్రి నాలుగేళ్ల క్రితం ఆర్దిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు, అతను గుజరాత్ వెళ్లి అక్కడే ఓ గుమస్తాగా పని చేసుకుంటున్నాడు, ఈ సమయంలో ఇక్కడ అతని కొడుకు మాత్రం తన తండ్రి కోసం ఎదురుచూశాడు, తన తండ్రి కనిపించకుండా ఇళ్లు విడిచివెళ్లాడని ఎక్కడైనా కనిపిస్తే కబురు చేయండి అని వీడియోలు కూడా పెట్టాడు..

ఇలా ఓ వీడియో వైరల్ అయింది, అతని ఫోటో ఉండటంతో గుజరాత్ లో సరదాగా టిక్ టాక్ చూస్తున్న ఆవ్యాపారికి మొత్తం విషయం అర్దమైంది.. మీ తండ్రి మా దగ్గర ఉన్నాడు అని కబురు పంపారు.. వెంటనే ఆ అబ్బాయి గుజరాత్ వెళ్లి తన తండ్రిని కలుసుకున్నాడు… ఇంటికి తీసుకువచ్చాడు, దీంతో టిక్ టాక్ కి ధన్యవాదాలు చెబుతున్నారు ఆకుటుంబం.