పద్మవ్యూహం చేధించడం తెలిసింది కేవలం ఈ నలుగురికే

పద్మవ్యూహం చేధించడం తెలిసింది కేవలం ఈ నలుగురికే

0
132

అసలు పద్మవ్యూహం ఎవరు పన్నారు అనేది ముందు చూస్తే…ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. ఇందులోకి కేవలం నలుగురికి మాత్రమే వెల్లడం రావడం తెలుసు.

పాండవులు అందరికి ఇది తెలియదు, పద్మవ్యూహాన్ని ఛేదించే పరిజ్ఞానము పాండవులలో శ్రీకృష్ణునికి, అర్జునుడికి, ప్రద్యుమ్నునికి శ్రీకృష్ణుని కొడుకుకి అలాగే , అభిమన్యునికి తప్ప మరెవరికీ లేదు. అయితే ఇక్కడ యుద్దంలో మాత్రం ప్రద్యుమ్నుడు పాల్గొనడానికి నిరాకరించాడు.

అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమని ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. అదే సమయంలో పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు నిలువరించ వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకుంటాడు. వ్యూహంలో ప్రవేశించిన అభిమన్యునికి చివరకు ఎవరి సాయం అందదు, అయినా అతను తెగించి కౌరవులకి చుక్కలు చూపిస్తాడు, కాని చివరకు పోరాడి మరణిస్తాడు.