పద్మవ్యూహం అంటే ఏమిటి ఎందుకు అభిమన్యుడు బలయ్యాడు

పద్మవ్యూహం అంటే ఏమిటి ఎందుకు అభిమన్యుడు బలయ్యాడు

0
141

పాండవులకు, కౌరవులకు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్దంలో కచ్చితంగా చర్చించుకునేది పద్మవ్యూహం గురించి ..అవును దీని గురించి చాలా మందికి తెలియదు.. ఇలాంటి వ్యూహలు ఆనాడు పన్ని అభిమన్యుడి మరణానికి కారణం అయ్యారు..కౌరవ గురువైన ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని ఆనాడు రచించాడు..ఇక ఈ పద్మవ్యూహంలోకి వెళ్లడం బయటకు రావడం కేవలం తెలిసింది శ్రీకృష్ణుడికి, అర్జునుడికి మాత్రమే.

కాని సుభద్ర కుమారుడైన అభిమన్యుడికి అందులోకి ప్రవేశించడం తెలుసు. తిరిగి ఎలా రావాలో తెలియదు. దీనికి కారణం ఉంది. ఓరోజు అభిమన్యుడి తల్లి, కృష్ణుడి సోదరి అయిన సుభద్ర తన భర్త అర్జునుడిని ఈ పద్మవ్యూహం గురించి అడిగింది. అప్పటికి అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉన్నాడు. ఎంతో వీరుడు అయిన అభిమన్యుడు అర్జునుడు చెబుతున్న మాటలు అన్నీ పిండంగా ఉండి కడుపులో విన్నాడు.

ఈ సమయంలో సుభద్ర నిద్రపోయింది. ఈ సమయంలో పద్మవ్యూహాంలోకి ఎలా వెళ్లాలో చెప్పాడు అర్జునుడు.కాని తిరిగి ఎలా రావాలో చెప్పే సమయంలో ఆమె నిద్రించింది అని గమనించి చెప్పడం ఆపేశాడు,ఇలా అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకుని చివరకు వీరోచిత పోరాటం చేసి కౌరవ సేనలను చీల్చి చెండాడి వారి కపటనాటకానికి బలయ్యాడు.