పద్మవ్యూహం ఎవరు నిర్మించారు దాని చరిత్ర ?

పద్మవ్యూహం ఎవరు నిర్మించారు దాని చరిత్ర ?

0
94

నాటి మహాభారత చరిత్ర నుంచి నేటి మహారాజకీయాల వరకూ పద్మవ్యూహం అన్నీంటికంటే బలమైన ప్రతిఎత్తుగా నిర్వచిస్తారు, అంతటి ఎత్తులకు పై ఎత్తు పద్మవ్యూహం అంటారు. నాడు మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో ఒకటి. ఈ వ్యూహ నిర్మాణం ఏడు వలయాలలో కూడి ఉంటుంది.

శత్రువులు ప్రవేశించడానికి దుర్భేధ్యంగా ఉంటుంది. ఈ వ్యూహాన్ని మహాభారత కురుక్షేత్రయుద్ధంలో పాండవులను సంహరించడానికి పన్నుతారు, కాని ఇందులో అభిమన్యుడు చిక్కుకొని విరోచితంగా పోరాడి మరణిస్తాడు.

ద్రోణాచార్యుడు పాండవులను ఓడించేందుకు తన అనుభవజ్ఞానాన్ని అంతా రంగరించి పద్మవ్యూహం పన్నాడు. ఈ సమయంలో పద్మవ్యూహాన్ని గమనించిన ధర్మరాజు సమయానికి అర్జునుడు అందుబాటులో లేకపోవటం వల్ల గత్యంతరం లేక అభిమన్యున్ని పద్మవ్యూహంలోకి ముందు వెళ్ళమని ఆ వెనుక ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు వెంట రక్షణగా వస్తామని చెప్పి ముందుకు పంపించాడు. కాని ఈ సమయంలో కౌరవ సేనతో పోరాడి అభిమన్యుడు ప్రాణాలు కోల్పోయాడు.