ఈ మధ్య ఎక్కడైనా పొలాల దగ్గర చూస్తుంటే పెద్ద పాములు కనిపించడం లేదు… అవును అవి వాటి ఆవాసాలు మార్చేసుకుంటున్నాయి, ఇటు ఇళ్ల దగ్గరకు కూడా వచ్చేస్తున్నాయి, అడవులు తోటలు పొలాలు తగ్గడంతో వాటికి ఆవాసాలు ఉండటం లేదు. అయితే వైద్యులు శాస్త్రవేత్తలు ఒకటే చెబుతున్నారు.
పాములని చంపవద్దు అని రైతులకి ఇవి మేలు చేస్తాయి అని పంటలకు మేలు అవుతుంది అని చెబుతున్నారు, అయితే పెద్ద పాముల కంటే చిన్న పాములు చాలా డేంజర్ అంటున్నారు. విషపూరిత నల్లతాచు తాచు నాగుపాము ఇలాంటి రక్తపింజర పాములు చిన్నవి చాలా డేంజర్.
ఎందుకంటే ఈ పాములు విషపూరితమైనవే.ఈ పాములు కాటేస్తే చనిపోయే ప్రమాదం ఉంది. పెద్ద పాములు కంటే చిన్న పాము పిల్లల్లోనే ఎక్కువ విషం ఉంటుంది.. ఎందుకు అంటే చిన్న పాములకి వాటిలో విషాన్ని దాచే అవయవం తయారవ్వదు, ఎదిగే కొద్ది తయారు అవుతుంది, అందువల్ల శరీరంలో ఉండే మొత్తం విషాన్ని ఒకేసారి కాటులో కక్కేస్తాయి, అందుకే వెంటనే పాము కరిస్తే అరగంటలో ఆస్పత్రికి తీసుకువెళ్లాలి కరిచిన చోట గట్టిగా గుడ్డ కట్టాలి.