బెంజ్ లో తిరిగేవాడు అయినా గంజి తాగే వాడు అయినా కచ్చితంగా పానీ పూరీని లైక్ చేస్తారు, రోడ్ సైడ్ పార్కుల దగ్గర అసలు ఖాళీ ఉండని బిజినెస్ అంటే పానీ పూరీ అని చెప్పాలి, ఆ టేస్ట్ ఆ పానీ అదరహో అంటారు, ముఖ్యంగా యువత రోజూ పానీపూరీ తినేవారు ఉంటారు.
అమ్మాయిలకు పానీపూరీ అంటే ఫేవరెట్, అయితే మార్చి నుంచి లాక్ డౌన్ దీంతో పానీపూరీ వ్యాపారం పూర్తిగా ఆగిపోయింది ఎక్కడా పానీపూరీ దొరకనిస్ధితి… తాజాగా పానీపూరీ అభిమానులకి గుడ్ న్యూస్ ..సామాజిక దూరాన్ని పాటిస్తూ, ఎవర్నీ అంటుకోకుండా, పరిశుభ్రమైన పానీపూరీని మీ చేతుల్లో పెట్టే పానీపూరీ అమ్మకం యంత్రం వచ్చేసింది
ఇక మార్కెట్లో ఇప్పుడు దీనికి డిమాండ్ ఉంటుంది,పానీపూరీ వెండింగ్ మెషీన్‌లో 20 రూపాయల నోటుని ఉంచితే సరి, మెషీన్‌లోనుంచి కదులుతోన్న బెల్టుపై వెంటనే పానీపూరి వచ్చేస్తోంది, దీని తయారీకి ఆరు నెలల సమయం పట్టింది, దీనిని ఈశాన్య రాష్ట్రాల్లో ఓ వ్యక్తి తయారు చేశారు.