పాపం వృద్దుడిపై ప్రాంక్ ….చివరికి ఘోరం జరిగిపోయింది

పాపం వృద్దుడిపై ప్రాంక్ ....చివరికి ఘోరం జరిగిపోయింది

0
103

ఈ మధ్య చాలా మంది ప్రాంక్స్ చేస్తున్నారు… అవి అందరూ ఒకేలా రిసీవ్ చేసుకోరు కదా.. కొందరు వీటిపై సీరియస్ అవుతుంటారు, ఓ ముసలాయన అలాగే సీరియస్ అయ్యాడు, కాని తన జీవితం నాశనం అయింది, తన ఇంట్లో సంతోషంగా సింగిల్ గా ఉంటున్నాడు ఓ పెద్దాయన,అతనికి 70 ఏళ్లు ..అయితే ఇంటి పక్కన ఉండే 15 ఏళ్ల కుర్రాడు ఆయనని ప్రాంక్ రూపంలో ఫూల్ చేశాడు.

అయితే దీంతో వెంటనే ఆ ముసలి వ్యక్తికి కోపం వచ్చింది …నన్ను పెద్దా చిన్న లేకుండా ఫూల్ చేస్తావా అని కోపంతో ఆ బాలుడి పీక పిసికేశాడు, దీంతో ఆ అబ్బాయి చనిపోయాడు, ఆ క్షణిక ఆవేశం అతనిని అలా చంపేలా చేసింది, దీంతో ఆ బాలుడి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న ఘట్కోపర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అయితే ఇలా పడిపోయిన తర్వాత అతను అబ్బాయిని పట్టించుకోలేదు.. కాని చుట్టుపక్కల వారు ఆ అబ్బాయి తల్లిదండ్రులకి చెప్పారు.. వెంటనే ఆస్పత్రికి తీసుకువెళ్లే సరికి అతను చనిపోయాడు, దీంతో ఆ ముసలాయనను అరెస్ట్ చేశారు పోలీసులు,చూశారా సరదా కోసం చేసిన పని క్షణికావేశంతో ఎంతటి విషాదం నింపిందో.