పాప‌ను కిడ్నాప్ చేయ‌బోయిన కోతి సంచ‌ల‌నం ఎందుకంటే?

పాప‌ను కిడ్నాప్ చేయ‌బోయిన కోతి సంచ‌ల‌నం ఎందుకంటే?

0
92

అవును మీరు విన్న‌ది నిజ‌మే ఓ కోతి ఏకంగా ఆడుకుంటున్న పాప‌ని కిడ్నాప్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది, దీనిని ఓ వ్య‌క్తి వీడియో తీశాడు, కాని ఆ పాప‌కి ఏమీ కాలేదు.ఖాళీగా ఉన్న ఆ వీధిలో… ఓ ఇంటి ద‌గ్గ‌ర ముగ్గురు పిల్లలు, ఓ పసిపాప అరుగు బయట బెంచీపై కూర్చున్నారు. ఆడుకుంటూ ఉన్న స‌మ‌యంలో ఓ కోతి టాయ్ బైక్ వేసుకుని వేగంగా వ‌చ్చింది.

వెంట‌నే వారి బెంచ్ ని గుద్దింది, అక్క‌డ నుంచి ఆ పాప‌ని ఈడ్చుకువెళ్లింది, దీంతో పిల్ల‌లు అర‌వ‌డంతో ఇంట్లో పెద్ద వారు బ‌య‌ట‌కు వ‌చ్చారు.. అప్ప‌టికే ఆమెని 8 అడుగులు లాక్కెళ్లింది, దీంతో వీడియో తీసిన వ్య‌క్తి కూడా దానిని బెదిరించాడు వెంట‌నే అది వ‌దిలి పారిపోయింది, పాప‌ని త‌ల్లి తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోయింది.

అయితే ఇక్క‌డ కొంద‌రు మంకీకీ ఏమైనా కిడ్నాప‌ర్లు ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటివి చేశారా అనే కోణంలో పోలీసులు ఇంట‌రాగేష‌న్ చేస్తున్నారు, లేక‌పోతే అస‌లు ఆ కోతికి బైక్ న‌డ‌ప‌డం ఎవ‌రు నేర్పి ఉంటారు ఇది కిడ్నాప‌ర్ల ప‌ని అని సీసీ కెమెరాలు చూస్తున్నార‌ట‌, అందుకే ఇలాంటి విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండండి.

ఇదంతా జరిగింది ఇండియాలో కాదు. ఇండొనేసియాలోని తంజుగ్సారీ గ్రామంలో. దీనిపై కంప్లైంట్ ఇచ్చారు, అక్క‌డ పోలీసులు దీనిని సీరియ‌స్ గా తీసుకున్నారు, ఏదైనా కుక్క‌లు కోతుల‌పై ఇలా అనుమానాలు వ‌స్తే వెంటనే ఫిర్యాదు ఇవ్వాలి అని పోలీసులు తెలిపారు..