పెద్దలు పెళ్లికి నో చెప్పడంతో లేచి పోయిన ప్రేమజంట

పెద్దలు పెళ్లికి నో చెప్పడంతో లేచి పోయిన ప్రేమజంట

0
118

యువతి యువకుడు నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు… వీరి ప్రేమ విషయాన్ని పెద్దలకు చెప్పారు.. ఇందుకు వారు ఒప్పుకోకపోవడంతో వారు ఇద్దరు లేచి పోయారు… దీంతో గ్రామంలో తీవ్ర అలజడి రేగింది.. ఈ సంఘటన వేలూర్ జిల్లా జోలార్ పేట సమీపం మండలావాడి కామరాజపురానికి చెందిన తిరుపతి చిన్న మండలావాడికి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు…

వీరి ప్రేమను ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు దీంతో వారు లేచి పోయారు… యువతి కుటుంబ సభ్యులు ఆగ్రహంతో యువకుడి ఇంటిపై దాడి చేశారు… ఇంట్లో ఉన్న వస్తువులను ద్వంసం చేసి నిప్పు అంటించారు…

ఇక ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు… ఈ ప్రమాదంలో లక్ష నగదు 20 సవర్ల బంగారు నగలు విలువైన వస్తువులు అగ్నికి ఆహూతి అయినట్లు వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు… వారి ఫిర్యాదు మేరకు పోలీసులు 20 మందిపై కేసు నమోదు చేసుకున్నారు..