పెళ్లైన వారం రోజులకే భర్తకి స్కెచ్ భార్య ఏం చేసిందో తెలుసా

పెళ్లైన వారం రోజులకే భర్తకి స్కెచ్ భార్య ఏం చేసిందో తెలుసా

0
116

ఇటీవల చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాము.. కొందరు అయితే ప్రియుడి మోజులో పడి భర్తలని వదిలేస్తున్నవారు ఉన్నారు. ఇక పెళ్లికి ముందే అన్నీ ముచ్చట్లుఅయిపోయిన కొందరు ప్రేమికులు, వారితో ఉన్న అనుభవాలని మర్చిపోలేక పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలని అబ్బాయిలని చంపేందుకు కూడా వెనుకాడటం లేదు, ముఖ్యంగా ప్రేమించిన వాడు దక్కలేదు అనే కోపం ఉంటే , ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు అనే భావం కూడా ఉంటోంది.

అనంతపురం జిల్లాలో దారుణంగా ఇలాంటి ప్రేమ పెళ్లి ఘటన చోటు చేసుకుంది. పెళ్లి అయి నెలకూడా కాకుండానే భర్త హత్యకు భార్య స్కెచ్ వేసింది…ఏకంగా ఎవరూ చేయకూడని పని చేసింది, ఏకంగా భర్తకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది.. జొన్నగిరి గ్రామంలో లింగమయ్యకు,ఓ యువతితో వారం రోజుల క్రితం వివాహం జరిగింది. వివాహమైన రోజు నుంచి వీరిద్దరికి గొడవలు జరుగుతున్నాయి, అయితే ఆమెకు అతను ఇష్టం లేదట దీంతో అతనిపై కోపం పగ పెంచుకుంది.

అత్తగారి ఇంటికి వచ్చిన లింగమయ్యకు ఈరోజు ఉదయం విషం కలిపిన పాల గ్లాసుతో వెళ్లి ప్రేమతో మాట్లాడి తాగించింది.. అయితే ప్రేమగా భార్య ఇచ్చిన పాలు తాగాడు భర్త, కాని అందులో కాలకూట విషం తన భార్యే కలిపింది అని అతను ఊహించలేదు. దీంతో అపస్మారక స్దితిలోకి వెళ్లాడు. వెంటనే అతనిని గుత్తి హస్పటల్ కి తీసుకవెళ్లి చికిత్స అందిస్తున్నారు..అయితే ఆమెకు పెళ్లికి ముందే అఫైర్ ఉందని ఇలా ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేశారు అనే కోపంతో భర్తని చంపాలి అని భావించింది, అయితే ఆమె తీరుతో అందరూ షాక్ అయ్యారు. పోలీసులు కూడా ఆమె చేసిన పనికి ఆశ్చర్యపోయారు.