పెళ్లి కోసం పెళ్లి కూతురు పెద్ద సాహసం చేసింది

పెళ్లి కోసం పెళ్లి కూతురు పెద్ద సాహసం చేసింది

0
85

ఈ వైరస్ పుణ్యమా అని చాలా మంది వివాహాలు మాత్రం ఆగిపోయాయి, తర్వాత చేసుకుందాం అని వివాహాలు వాయిదా వేసుకున్నారు, ఇంకొందరు కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివాహాలు చేసుకున్నారు, ఇక లాక్ డౌన్ వల్ల చాలా మందికి చిక్కులు వచ్చాయి అనే చెప్పాలి..

అయితే ఇక్కడ కూడా ఓ వధువు తన పెళ్లి వాయిదా పడకూడదని పెద్ద సాహసమే చేసింది. ఏకంగా 80 కిలోమీటర్లు ఒంటరిగా నడిచి వరుడి ఇంటికి చేరుకుంది. పెళ్లి చేసుకుందాం పదా అంటూ వరుడితో ఏడు అడుగులకు సిద్ధమైంది. దీంతో అందరూ షాక్ అయ్యారు, అబ్బాయిలు ఇలా అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లికి సిద్దం అవుతున్నారు లాక్ డైన్ వేళ.

తాజాగా కన్పూర్లోని మంగల్బూర్ గ్రామానికి చెందిన గోల్డీ వివాహం బైస్పూర్కు చెందిన వీరేంద్ర కుమార్తో మే 4న జరిపించాలని నిశ్చయించారు. కానీ లాక్డౌన్ కారణంగా ఈ నెల 17కు వాయిదా వేశారు. మరోసారి కూడా లాక్డౌన్ పొడిగిస్తారనే వార్తలు రావడంతో ఆ అమ్మాయి అబ్బాయి ఇంటికి చేరుకుంది, దాదాపు 80 కిలోమీటర్లు నడిచి వెళ్లింది, చివరకు ఆమె ప్రేమకి ఇలా వారికి గుడిలో వివాహం చేశారు, పెళ్లి ఇలా వాయిదా పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆమె.