పెళ్లిలో వింత గొడ‌వ చివ‌ర‌కు దారుణం జ‌రిగింది

పెళ్లిలో వింత గొడ‌వ చివ‌ర‌కు దారుణం జ‌రిగింది

0
93

కొన్ని సార్లు వివాహాలు జ‌రిగే స‌మ‌యంలో చిన్న చిన్న త‌గాదాలు వ‌స్తూ ఉంటాయి, ఈ స‌మ‌యంలో ఇరు కుటుంబాలు మాట్లాడుకుని ఏ స‌మ‌స్య లేకుండా స‌ర్దుకుపోతారు.. మ‌రికొంద‌రు మాత్రం దీనిని పెద్ద రాద్దాంతం చేస్తారు, అయితే యూపీలో ఓ పెళ్లి ఇంట విషాదం జ‌రిగింది.

భోజనం విషయంలో ఇరువైపుల బంధువుల మధ్య జరిగిన గొడవ తారాస్థాయికి చేరి వధువు సోదరుడి మృతికి దారితీసింది. ఫరూఖాబాద్ ఏరియాలోని పహర్‌పూర్ గ్రామానికి చెందిన 26 ఏండ్ల యువకుడు మనోజ్ కుమార్‌కు గోవింద్‌పూర్ అదుల్లాపూర్‌కు చెందిన యువతికి పెళ్లి జ‌రిగింది

అంతా సంద‌డిగా ఉంది, ఈ స‌మ‌యంలో మందు తాగిన పెండ్లి కొడుకు, అత‌ని ఫ్రెండ్స్ భోజ‌నాలు బాగాలేవు అన్నారు, దీంతో వ‌ధువు త‌ర‌పు వారితో వాగ్వాదం జ‌రిగింది, ఇరువురికి మాటా మాటా పెరిగి కొట్టుకున్నారు. వరుడు, అతని స్నేహితులు వధువు సోదరుడిని కారులో ఎక్కించుకుని వెళ్లారు. తన తమ్ముడిని తిరిగి తీసుకురమ్మంటూ వధువు ఫోన్ చేసినా తీసుకురాలేదు.. తెల్లవారుజామున మూడు గంటలకు వధువు తమ్ముడి శవాన్ని పంపించారు. అత‌ని శ‌రీరంపై దెబ్బ‌లు ఉన్నాయి, దీంతో పెండ్లి కొడుకు కుటుంబం స్నేహితుల‌పై కేసు పెట్టారు .