పిల్లల ఆకలికి ఈ తల్లి ఏం చేసిందంటే

పిల్లల ఆకలికి ఈ తల్లి ఏం చేసిందంటే

0
137

ఓ పక్క కరోనా వైరస్ మహమ్మారి దేశాన్ని పట్టిపీడిస్తోంది.. ఈ సమయంలో ఉన్నవాడికి ఎలాంటి ఇబ్బంది లేదు కాని లేనివారు జీవితం దారుణంగా ఉంది ..పొట్ట చేతపట్టుకుని కూలీపనుల కోసం వెళ్లి అక్కడ కూలీ లేక ఉపాది లేక డబ్బు లేక చాలా మంది సొంత గ్రామాలకు వెళ్లలేక రోడ్లపై నడుచుకుంటూ వెళుతున్నారు.

ఈ సమయంలో ఓ తల్లి పిల్లల ఆకలి చూసి తల్లడిల్లిపోయింది, అక్కడ ఉచితంగా ప్రభుత్వం అన్నం పెడుతోంది అని తెలుసుకుంది, కాని సామాజిక దూరం పాటించాలి కాబట్టి ఆ లైన్ లో నిలబడింది .ఆమె దాదాపు 11 గంటలకు ఆ పిల్లలలో లైన్ లో నిలబడితే ఆమెకి రెండు ఆహరపొట్లాలు 1 గంటకి దొరికాయి.

దీంతో ఒక ఆహరపొట్లం పిల్లలకు పెట్టి ఆమె రెండు ముద్దలు తింది, సాయంత్రం అన్నం దొరకదు అని అదే ఆహరం దాచుకుంది, తల్లి ప్రేమచూసి ఓ వ్యక్తి ఆమె వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు, అతను ఆమెకి 500 సాయం చేసి పిల్లలకు పాలు పట్టించమని చెప్పాడు.