పొలంలో రైతుకి దొరికిన వజ్రం ? దాని ఖరీదు ఎంతంటే

పొలంలో రైతుకి దొరికిన వజ్రం ? దాని ఖరీదు ఎంతంటే

0
91

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు అంటారు నిజమే , తాజాగా ఓ కూలీకి అదృష్టం తలుపుతట్టింది..మధ్యప్రదేశ్లోని ఓ గనిలో భారీ వజ్రం లభ్యమైంది. పన్నా జిల్లాలో 10.69 క్యారెట్ల వజ్రం బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. రాణిపూర్ ప్రాంతంలోని గనిని లీజుకు తీసుకున్న ఆనందిలాల్ కుష్వాహా ఈ వజ్రం దొరికింది.

దీంతో అతను చాలా ఆనందంలో ఉన్నాడు, దాదాపు ఇది ఖరీదు 50 లక్షలు ఉంటుంది అని చెప్పారు అక్కడ అధికారులు..ఈ విలువైన రాయిని వేలం వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ రాయల్టీ, పన్నులను తగ్గించిన తరువాత ఆదాయాన్ని డిపాజిటర్కు ఇస్తామని స్పష్టం చేశారు అధికారులు.

ఈ ప్రాంతం అంతా వజ్రాలకు ప్రసిద్ది, గత ఆరునెలలుగా తన కుటుంబంతో ఇలా కష్టపడుతున్నాము అని ఇన్నాళ్లకు నాకు ఈ విలువైన వజ్రం దొరికింది అని అతను చెబుతున్నాడు, దీంతో ఆ కుటుంబం చాలా సంతోషంలో ఉంది.