మనం కొన్ని ఆచారాలుచూస్తే ఆశ్చర్యపోతాం, అసలు ఇలాంటి ఆచారాలు ఉంటాయా అని మతిపోవడం ఖాయం.. కొన్ని సాంప్రదాయాల గురించి తెలిస్తే ఒళ్లుగగూర్పాటు కలుగుతుంది. అయితే తాజాగా ఓ ఉత్సవం గురించి తెలిస్తే మతిపోతుంది.
జపాన్ ప్రజలు ఘనంగా జరుపుకునే ఉత్సవం కనమార మాట్సురి… తెలుగులో దీనిని లింగమహోత్సవం గా చెప్పవచ్చు, ఆరోజు చాలా వస్తువులు లింగం అంటే పురుషాంగం రూపంలో కనిపిస్తాయి..బట్టలు తినే ఆహారం ఇలా అన్నీ ఆ షేప్ లో తయారు చేస్తారు.
ఏటా మార్చి నెల రాగానే జపాన్ లోని హొన్షు ఐల్యాండ్ ఈ పండుగకు సిద్ధమై పర్యాటకులతో కిటకిట లాడుతుంది, ఇక్కడ పురుషాంగం ప్రతిమ కొయ్యతో తయారు చేసి దానిని ఉత్సవంగా గ్రామాల్లో ఊరేగిస్తారు ,దానిని అందరూ ముట్టుకుంటే పుణ్యం వస్తుంది అని భావిస్తారు.
సంతానం లేనివారు సంతానం కోసం పరితపించేవారు ఆ పురుషాంగాన్ని ప్రార్థిస్తూ ముద్దు పెట్టు కుంటారు. 1969 నుంచి ఇక్కడ ఇదే ఉత్సవం జరుపుతున్నారు, అంతేకాదు ఇక్కడ పురుషాంగం రూపంలోనే దాదాపు రెండు రోజుల పాటు అన్నీ వస్తువులు అమ్మకాలు చేస్తారు.