బ్రేకింగ్ – ప్రభుదేవా రెండో వివాహం – ఆమె ఎవరంటే కోలీవుడ్ లో చర్చ

బ్రేకింగ్ - ప్రభుదేవా రెండో వివాహం - ఆమె ఎవరంటే కోలీవుడ్ లో చర్చ

0
102

మన దేశంలో ప్రభుదేవాకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లో అనేక స్టార్ హీరోల సినిమాలకు ఆయన కొరియోగ్రాఫర్ గా పని చేశారు, ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు, అంతేకాదు డ్యాన్సర్ గా, నటుడిగా, దర్శకుడిగా ఎంతో పేరు ఉంది ఆయనకు.

గత ఏడాది దబాంగ్ 3 చిత్రాన్ని తెరకెక్కించిన ప్రభుదేవా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరో రాధే అనే చిత్రం చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు తెలుస్తుంది. బఘీర అనే చిత్రం కూడా చేస్తున్నారు ఆయన.. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

1995లో రామలతని వివాహం చేసుకున్న ప్రభుదేవా 2011లో ఆమెకు విడాకులు ఇచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.తర్వాత నయనతారతో ఆయన రిలేషన్ లో ఉన్నారు, అయితే మళ్లీ వారిద్దరూ దూరం అయ్యారు, తాజాగా ఆయన ఇప్పుడు బంధువుల అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్దం అవుతున్నారట, ఈ వార్తలు కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.