ప్రాణాలు తీసిన AC జాగ్రత్తగా ఉండాలి ప్రతీ ఒక్కరు తెలుసుకోండి

ప్రాణాలు తీసిన AC జాగ్రత్తగా ఉండాలి ప్రతీ ఒక్కరు తెలుసుకోండి

0
100

మనం ఈ వేడి నుంచి తట్టుకోవడానికి ఏసీ కొనుక్కొంటాము.. కాని ఒక్కోసారి ప్రమాదాలు సంభవిస్తే ఆ చల్లని ఏసీనే , వేడిగా మారి మనల్ని హరిస్తుంది, ప్రాణాలు తీసుకుపోతుంది అంటున్నారు నిపుణులు. ఏసీ కారణంగా ఓ జంట చనిపోయారు. ఇది యూపీలో జరిగింది, ఉదయం స్ధానికులు చూసే సరికి వారు ఇంటిలో మరణించి ఉన్నారు.

యూపీలోని తుండ్లా పరిధిలోని మొహల్లా భగవాన్ ఆశ్రమం ప్రాంతంలో అజయ్ మిశ్రా, నిషా మిశ్రా నివాసం ఉంటున్నారు. ఉదయం ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు, వారు ఇంటి కిటీకి నుంచి లోపలకి వెళ్లగా ఏసీలో షార్ట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు భావించి వెంటనే అగ్నిమాపక దళానికి సమాచారమిచ్చారు.

వారు స్పాట్ కు వచ్చి భార్య భర్తని బయటకు తీసుకువచ్చారు, అయితే భార్య భర్తలు ఇద్దరికి ఆస్పత్రికి తీసుకువెళ్లారు కాని వారు నిద్రలోనే మరణించారు అని తెలిపారు వైద్యులు. ఉదయం 7 గంటల సమయంలో ఏసీలో షార్ట్సర్క్యూట్ కారణంగా విషవాయువులు వ్యాపించి ఉంటాయని ఆ వాయువులు పీల్చి నిద్రలోనే చనిపోయారు అని తెలిపారు వైద్యులు.