ప్రేమజంట కాపాడమని కోర్టుకి వెళ్లింది రివర్స్ లో వారికి పదివేలు ఫైన్ వేసిన కోర్టు ఎందుకంటే

ప్రేమజంట కాపాడమని కోర్టుకి వెళ్లింది రివర్స్ లో వారికి పదివేలు ఫైన్ వేసిన కోర్టు ఎందుకంటే

0
142

కోర్టు దృష్టిలో ఎవరూ తప్పించుకోలేరు ఇది మాత్రం వాస్తవం, తాజాగా ఓ జంట ప్రేమ వివాహం చేసుకుంది, అయితే ఇంటిలో పేరెంట్స్ మా పెళ్లికి ఒప్పుకోరు అని వెంటనే వారు మాకు రక్షణ కల్పించాలి అని కోర్టులో పిటిషన్ వేశారు, ఇక్కడే ఈ కేసు అసలు మలుపు తిరిగింది.

పంజాబ్కు చెందిన ఓ ప్రేమజంట తమ కుటుంబాలకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారు. చివరకు కోర్టుని ఆశ్రయించారు, ఈ సమయంలో పెళ్లి ఫొటోలను హైకోర్టు పరిశీలించింది. అయితే పెళ్లికి వచ్చిన ఫ్రెండ్స్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూడా మాస్క్ ధరించలేదు భౌతిక దూరం పాటించలేదు.

దీంతో కోర్టు సీరియస్ అయింది, కరోనా నిబంధనల ప్రకారం ముఖాలకు మాస్క్లు ధరించలేదని గుర్తించింది.అందుకే ఆ నవదంపతులకు ధర్మాసనం రూ.10,000 ఫైన్ విధిస్తూ తీర్పు ఇచ్చింది…అంతేకాదు ఈ నగదుతో ఆ ప్రాంతంలో ప్రజలకు మాస్క్ లు పంచిపెట్టాలి అని తెలిపారు, ఇలా జరిగింది చివరకు ఆ జంటకు .