వంటలక్క ప్రేమి విశ్వనాధ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

వంటలక్క ప్రేమి విశ్వనాధ్ గురించి మీకు ఈ విషయాలు తెలుసా

0
90

తెలుగులో అంతరంగాలు, విధి, అన్వేషణ, పిన్ని, మొగలిరేకులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సీరియల్స్ తెలుగు ప్రేక్షకులు ఆదరించారు, చాలా వరకూ దర్శకులు నటులు సినిమాల కంటే పేరు తెచ్చుకున్నారు, అయితే ఇప్పుడు అంత ఫేమ్ తెచ్చుకుంది నేటి సీరియల్ కార్తీక దీపం.

వంటలక్క డాక్టర్ బాబు ఎప్పుడు కలుస్తారా అని అందరూ ఎదురుచూస్తున్నారు, ఈ సీరియల్ లో ప్రతీ ఒక్కరు కూడా అద్బుతమైన నటన చేస్తున్నారు, ఈ సీరియల్ క్రేజ్ మాములుగా లేదు, ఇందులో నటించే
ప్రేమి విశ్వనాథ్ కు ఎంతో ఫాలోయింగ్ ఉంది.

ప్రేమి 1991, డిసెంబరు 2న కేరళ రాష్ట్రానికి చెందిన ఎర్నాకులంలోని ఎడప్పల్లిలో జన్మించింది. ఈమె తండ్రి పేరు విశ్వనాథ్.. తల్లి కాంచన. ఇక ఆమె చదువులో టాప్, అంతేకాదు ఆమె లా చదివింది, ఇక్కడ కొచ్చిలో ఆమె లీగల్ అడ్వజైర్ గా చేశారు ఓ ప్రముఖ సంస్దకి…ప్రేమి విశ్వనాథ్ కు ఫొటోగ్రఫీ అంటే కూడా చాలా ఇష్టం.. ఇక కొన్ని నెలలు మోడలింగ్ లో కూడా వర్క్ చేసింది.

కరతముత్తు అనే మలయాళం సీరియల్ ద్వారా ఈమె నటిగా మారింది. ఆ సీరియల్ నే కార్తీక దీపం గా కొన్ని మార్పులు చేసి రీమేక్ చేస్తున్నారు, ఆమె కేరళలోని జోతిష్యుడైన డా. టి.ఎస్. వినీత్ భట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకి ఇప్పుడు మళయాల, తెలుగు సినిమాల్లో అవకాశాలు చాలా వస్తున్నాయి అని తెలుస్తోంది.