ప్రియురాలి ఎంగేజ్ మెంట్ – ప్రియుడు ఏం గిఫ్ట్ పంపాడంటే – అస్సలు ఊహించరు

ప్రియురాలి ఎంగేజ్ మెంట్ - ప్రియుడు ఏం గిఫ్ట్ పంపాడంటే - అస్సలు ఊహించరు

0
194

పెళ్లికి ముందు ప్రేమలో పడుతున్నారు కొందరు, చివరకు ఇద్దరు విడిపోయి వేరే వారిని వివాహం చేసుకుంటున్నారు, మరికొందరు ప్రేమికులే వివాహం చేసుకుంటున్నారు, అయితే ఇలా ప్రేమికులు విడిపోయిన తర్వాత తనకు దక్కని అమ్మాయి వేరేవారికి దక్కకూడదు అని చాలా మంది ప్రియుళ్లు ఆలోచిస్తున్నారు.

ఈ సమయంలో నందాపుర్ కు చెందిన అమూల్య అనే అమ్మాయి కుందన్ శంకర్ ఇద్దరూ ప్రేమించుకున్నారు, ఇక అబ్బాయికి డబ్బు లేకపోవడం వేరే కులం అని అమూల్య తండ్రి ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని తన అల్లుడిగా సెలక్ట్ చేశాడు.

ఇక పేరెంట్స్ మాట కాదు అనలేక ఆమె కూడా పెద్దలు చెప్పిన అబ్బాయితో పెళ్లికి ఒకే అంది, అయితే ఆమెకి వివాహం అవ్వకూడదు అని ఆమె ఎంగేజ్ మెంట్ సమయంలో ఆర్డర్ ఇచ్చిన లవ్ సింబల్ కేక్ లో వారిద్దరూ చనువుగా ఉన్న ఫోటో పెట్టి కేక్ తయారు చేయించాడు ప్రియుడు కుందన్ శంకర్.

ఆ బేకరి యజమాని కొడుకు తన ఫ్రెండ్ కావడంతో ఈ పని చేశాడు, చివరకు ఇద్దరూ కేక్ కట్ చేసిన తర్వాత ఈ ఫోటో బయట పడింది, వెంటనే అబ్బాయి కుటుంబం ఆమెని అక్కడ వదిలేసి పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు, అమ్మాయి తండ్రి బేకరి యజమాని అమ్మాయి ప్రియుడిపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.