ఆస్తి కోసం కొడుకులు ఇలాంటి దారుణం కూడా చేస్తారా

ఆస్తి కోసం కొడుకులు ఇలాంటి దారుణం కూడా చేస్తారా

0
106

పంజాబ్ లోని ఓ వ్య‌క్తి అతి ఆవేశం చివ‌ర‌కు ఓ దారుణానికి కార‌ణం అయింది, ఇక్క‌డ హ‌ర్దీప్ సింగ్ భార్య నాలుగేళ్ల క్రితం మ‌ర‌ణించింది, ఈ స‌మయంలో అత‌ను మ‌రో మ‌హిళ‌ల‌ను వివాహం చేసుకున్నాడు, అయితే అత‌నికి మొద‌టి భార్య సంతానంగా 50 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు, అయినా ఈ 75 ఏళ్ల వ‌య‌సులో వివాహం చేసుకున్నాడు, తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు అనే విష‌యం కుమారుడికి తెలియ‌దు.

ఇక కొడుకు అక్క‌డ భూ స్వామిగా పేరు సంపాదించాడు, తండ్రి ఆస్తి అత‌ని ద‌గ్గ‌రే ఉంది.. కాని వివాహం చేసుకున్న రెండో ఆమెకి ఓ మ‌గ‌బిడ్డ పుట్టాడు, దీంతో ఈ విష‌యం కొడుక్కి తెలిసింది, వెంట‌నే ఈ ఆస్తి నాకు కాకుండా రెండో త‌ల్లి బిడ్డ‌కు వ‌స్తుంది అని భ‌య‌ప‌డ్డాడు.

ఇలా అనుకుంటున్న స‌మ‌యంలో తండ్రి గుండెపోటుతో మ‌ర‌ణించాడు. అంత్యక్రియలు చేసే కంటే ముందే ఆస్తి సమస్యలు వచ్చాయి. హర్దీప్‌ ఆస్తి తనకు కూడా దక్కాలని సదరు మహిళ కోరింది. దీంతో వెంట‌నే కొడుకు ఆమెపై కాల్పులు జ‌రిపాడు. అక్క‌డ నుంచి వీరిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు,ఆమె ఆరోగ్యం బాగానే ఉంది కాని అత‌ను ప‌రారీలో ఉన్నాడు.