పూరీ జగన్నాధ రథయాత్ర చరిత్ర తప్పక తెలుసుకోండి

పూరీ జగన్నాధ రథయాత్ర చరిత్ర తప్పక తెలుసుకోండి

0
84

పూరీ జగన్నాధ ఆలయం దేశంలో ఎంతో ప్రముఖమైన పుణ్యక్షేత్రం.. లక్షలాది మంది భక్తులు ఆయనని దర్శించుకునేందుకు పూరీ చేరుకుంటారు, ముఖ్యంగా ఆయన రథయాత్ర సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తారు.. ఈ ఉత్సవం ప్రతీ సంవత్సరం జూన్ లేదా జూలై నెలల్లో నిర్వహిస్తారు. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు.

దీనిని తిలకించేందుకు ఆషాఢ శుద్ధవిదియ నాడు లక్షల మంది అక్కడకు చేరుకుంటారు…రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.

ఇక మన దేశంలో ఏ ఆలయంలోని అయినా ఊరేగింపుల్లో అసలు మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. కాని ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ద్వాపర యుగంలో కంసుడిని వధించడానికి బలరామకృష్ణులు బయలుదేరిన ఘట్టాన్ని పురస్కరించుకుని ఈ యాత్ర జరుపుతారని చెబుతూ ఉంటారు. ఈ రథయాత్ర సమయంలో ఎన్నో ఏర్పాట్లు చేస్తారు ఇక్కడ అధికారులు.