రథసప్తమి విశిష్టత తప్పక తెలుసుకోండి

రథసప్తమి విశిష్టత తప్పక తెలుసుకోండి

0
89

సూర్యనారాయణ మూర్తిని తమ ఇలవేల్పుగా చాలా మంది భావిస్తారు, అయితే అసలు సమస్త ప్రాణులకు సూర్యుడు ఉండాల్సిందే, సూర్యభగవానుడిని ప్రత్యక్ష నారాయణుడిగా భావించి ఆరాధిస్తారు. ఈ కారణంగానే ప్రాచీనకాలంనాటి సూర్య దేవాలయాలు తమ వైభవాన్ని కోల్పోకుండా వెలుగొందుతూ వున్నాయి.

లోకాన్ని ఆవరించిన చీకట్లను పారద్రోలి వెలుగును ప్రసాదించడం కోసం సూర్యుడు వేయి కిరణాలను ప్రసరింపజేస్తూ వుంటాడు. ఈ వేయి కిరణాలలో ఏడు కిరణాలు అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి.. అందుకే సూర్యుడు ఏడు గుర్రాలను కలిగిన రథంపై భక్తులకు దర్శనం ఇస్తాడు అంటారు..

సూర్యుడు తొలిసారిగా ఈ రథాన్ని అధిరోహించి తన బాధ్యతలను చేపట్టిన రోజే రథసప్తమి గా చెప్పబడుతోంది. బ్రహ్మముహూర్తంలో నక్షత్రాలు రథం ఆకారాన్ని సంతరించుకుని కనిపిస్తాయి, అందుకే సూర్యభగవానుడికి ఆహ్వనం పలుకుతూ అందరూ లోగిళ్లల్లో రథం ముగ్గులు వేస్తారు.