రాహుల్ కంటే శ్రీముఖికి భారీ పారితోషికం షాకిచ్చిన బిగ్ బాస్

రాహుల్ కంటే శ్రీముఖికి భారీ పారితోషికం షాకిచ్చిన బిగ్ బాస్

0
99

బిగ్ బాస్ విన్నర్ గా రాహుల్ టైటిల్ గెలుచుకున్నారు.. అయితే మాస్ క్లాస్ ఫాలోయింగ్ కూడా అతనికి బాగా పెరిగింది.. రాహుల్ కు బిగ్ బాస్ టైటిల్ తో పాటు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ వస్తుంది. అందులో ట్యాక్సులు పోను అతనికి 38లక్షల రూపాయలు లేదా 35 లక్షల రూపాయలు వస్తాయి, అలాగే బిగ్ బాస్ స్పాన్సర్స్ కూడా మనీ ఇవ్వడం జరుగుతుంది. సుమారు అదో 40 లక్షల రూపాయల వరకూ వస్తుంది కొన్ని సంస్ధలు వోచర్స్ ఇస్తాయి. సో మోత్తం కలిసి రాహుల్ కు 1 కోటి రూపాయల వరకూ అందుతుంది అని చెప్పాలి.

అయితే రాహుల్ విన్నర్ అయినా శ్రీముఖి రన్నర్ అయింది. కాని బిగ్ బాస్ శ్రీముఖికి రాహుల్ కంటే అత్యంత భారీపారితోషికం ఇచ్చారట, శ్రీముఖికి హౌస్ లో వారానికి 10 లక్షల రూపాయలు చెల్లించారట. సుమారు ఆమెకు 2 కోట్ల రూపాయల వరకూ వచ్చింది అని చెబుతున్నారు. 100 రోజులు బిగ్ బాస్ హైస్ లో ఉన్నందుకు శ్రీముకి 1 కోటి 50 లక్షలు చెల్లించారట. అలాగే స్పాన్సర్స్ వోచర్లు, ఇలా మొత్తం రన్నరప్ అమౌంట్ తో కలిపి ఆమెకు 2 కోట్ల రూపాయల వరకూ వచ్చింది అంటున్నారు.. మొత్తానికి టైటిల్ రాహుల్ కి వచ్చినా ఆర్ధికంగా శ్రీముఖి మాత్రం రాహుల్ కంటే ఎక్కువ పొందింది అని తెలుస్తోంది.